పత్రికా వార్తల్లో.....
అదృష్టదీపక్
జనవరి 18కవి, సినీ గీతరచయిత అదృష్టదీపక్ షష్టిపూర్తి
అదృష్టదీపక్ - ఎంత పొయెటిక్ పేరు!అ - దృష్టం అంటే కనపడనిదిఅలాగే అరవైల్లోకి వచ్చిన అదృష్టదీపక్ కూడాసముద్రాన్ని కమండలంలోఇమిడ్చేసిన రుషిలాగ పైకి కనపడడు!తక్కువే రాస్తాడు - ఎక్కువగా గుర్తుండిపోయే లాగ!అతనో చల్లని అగ్ని పర్వతంవెచ్చని హిమాలయంగులాబీ లా కనిపించే విచ్చుకత్తిమొగలి రేకులా అనిపించే మల్లెపువ్వుసగం నెత్తురుతోనూ, సగం కన్నీళ్ళతోనూ రాస్తాడువిమర్శ మాత్రం గండ్రగొడ్డలితో రాస్తాడని నా అనుమానం!అతను ఎత్తుపల్లాల్ని ఎక్కి దిగిన మనిషి
‘మానవత్వం పరిమళించే మంఛి మనసున్న మనిషి’
అతనెప్పుడూ వీరబాహుడిలాగభుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడుఎవరన్నా అభిప్రాయం అడిగితే నిర్మొహమాటంగాఆ కుండని మొహాన భళ్ళున కొడతాడు!నిజం చెప్పడం అతని వ్యసనందాని వల్ల అతను చాలా దెబ్బలు తిని ఉండొచ్చుకానీప్రతి దెబ్బా అతని పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా!ఎంచేతంటే వీరుణ్ని ఎప్పుడైనా మనం గాయాలతోనే కదా గుర్తించాలి!అతని స్నేహం తియ్యని మధురానుభూతుల ప్రవాహం!అతనితో మాట్లాడుతుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతుంటాయిచుట్టూ ఉన్న వాతావరణాన్ని జిగేల్ మని వెలిగించే సంభాషణాచాతుర్యంఅతనిది!సాహిత్యంలో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లోనూ అతను ప్రవేశించాడుకేవలం ప్రవేశించడమే కాదు-వచన కవిత రాసినా, ఉద్యమ గీతం రాసినా,సినిమా పాట రాసినా, విమర్శనా వ్యాసం రాసినాతనదైన ముద్ర బలంగా కొట్టాడుకవిగా, కధకుడిగా, విమర్శకుడిగా,వక్తగా, అధ్యాపకుడిగా, నాటక న్యాయనిర్ణేతగాఅతను ‘షణ్ముఖుడు’ !నాటకం చూస్తున్నప్పుడు అతనో విలన్పోటీల రిజల్ట్ చెప్పేటప్పుడు అతనో జెంటిల్ మన్బహుమతీ ప్రదానం అయిపోయాక అతను ఓ హీరోమనసా - అతను ఏది చేసినా ఇష్టంగానే చేస్తాడువాచా - అతను నమ్మిన విషయాన్నే చెప్తాడుకర్మణా - కొంపలు మునిగిపోతున్నా తాను నమ్మినదాన్నే ఆచరిస్తాడుఅసలైన వ్యక్తిత్వం అంటే అదే మరి!రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు ఇచ్చినాసినిమా రంగం ‘కళాసాగర్’ అవార్డు ఇచ్చినాఅతని ఆలోచనలు ఎప్పుడూ నేలమీదే నడుస్తుంటాయిఅతని కళ్ళు నిరంతరం జీవితాన్నే చదువుతుంటాయిఅందుకే అదృష్టదీపక్ అంటే నాకు ఎంతొ ఇష్టం!అతనికి అరవై ఏళ్ళంటే నమ్మటం చాలా కష్టం!!
-తనికెళ్ళ భరణి
- అదృష్టదీపక్ షష్టిపూర్తి సందర్భంగా -
‘సాక్షి’ దినపత్రిక
17/01/2010 తేది ఆదివారం సంచికలో ప్రచురించిన తనికెళ్ళ భరణి రచన...
......................................................................
విజయవాడలో...
మహాకవి శ్రీశ్రీ శతజయంతి మహోత్సవం -
కాంస్య విగ్రహ ఆవిష్కరణ...
'శ్రీశ్రీ సాహితీ పురస్కారాన్ని అందుకున్న.. అదృష్ట దీపక్
ఆంధ్రభూమి
అదృష్ట దీపక్‌కు కొండేపూడి శ్రీనివాస రావు సాహితీ పురస్కారం
September 26th, 2010
రామఛంద్రపురం, సెప్టెంబర్ 25: ప్రముఖ కవి, విమర్శకుడు, సినీ గేయరచయిత అదృష్టదీపక్ కీర్తి కిరీటంలో మరో రెండు కలికితురాయిలు చేరుతున్నాయి. అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో అమరజీవి కొండేపూడి శ్రీనివాస రావు సాహితీ పురస్కారాన్ని, ప్రత్యేకించి ఆ సంస్థ రజతోత్సవ పురస్కారాన్ని అదృష్టదీపక్‌కు అందిస్తున్నట్లు అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సాహితీ పురస్కారం గత సంవత్సరాలలో ఆవంత్స సోమసుందర్, చాగంటి సోమయాజులు, బొల్లిముంత శివరామకృష్ణ, గజ్జెల మల్లారెడ్డి, మధురాంతక రాజారాం, బూదరాజు రాధాకృష్ణ, పోరంకి దక్షిణామూర్తి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, చందు సుబ్బారావు, దేవి ప్రియ, సుద్దాల అశోక్‌తేజ లాంటి ప్రముఖులు అందుకున్నారు. అక్టోబర్ 3న గుంటూరులోని 5/3 అరండళ్ పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో నిర్వహించే కార్యక్రమంలో అదృష్టదీపక్‌కు 5 వేల 116 రూపాయలు నగదు (పర్స్), జ్ఞాపిక, నూతన వస్త్రాలతో సత్కరించనున్నట్లు గుంటూరు అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మధ్యనే హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘‘సృజనాత్మక సాహిత్యం’’లో అదృష్టదీపక్‌కు కీర్తి పురస్కారాన్ని ప్రకటించారు. అభ్యుదయ కవితాపథంలో మూడున్నర దశాబ్ధాలకు పైగా పయనిస్తున్న అదృష్టదీపక్ విద్యార్ధి యువజన సమాఖ్యలు, అరసం, ప్రజానాట్య మండలి సంస్థలలో సమర్ధవంతంగా ఎన్నో బాధ్యతలను సక్రమరీతిలో నిర్వహించిన క్రియాశీల కార్యకర్తగా పేరుపొందారు. నిబద్ధ కవీ, కథకుడు, బుర్రకథా రచయిత, వ్యాసకర్త, విమర్శకుడు, ఉపన్యాసకుడు, నటుడు, గాయకుడు, సినీగేయరచయిత అయిన అదృష్టదీపక్ వామపక్ష భావజాలం నిండిన కుటుంబంలో జన్మించారు. వస్తువూ, శిల్పమూ విడదీయరానంతగా పెనవేసుకుపోయిన అచ్ఛమైన అభ్యుదయ కావ్యాలను ఆయన అందించారు. సమకాలీన జీవితమే సత్కవితా వస్తువు అని భావించి సమాజంలో నిమ్మోన్నతాలను కవితా దీపాలతో అనే్వషించి అసమ సమాజం మీద తన అక్షరాలతో దండయాత్ర చేస్తున్న అభ్యుదయ కవి అదృష్టదీపక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభ్యుదయ రచయితకు ప్రాణప్రదమైన విమర్శనాత్మక వాస్తవికతను అందుకుని పతనమవుతున్న విలువల మీద ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న విమర్శకుడు అదృష్టదీపక్. ‘‘మంచి నాటకమంటే చూసినప్పుడే కాకుండా చదివినప్పుడు కూడా ఆలోచింపజేయాలి. సమాజాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలకు పరిష్కారం చూపాలి.’’ అనే అభిప్రాయంతో న్యాయనిర్ణేతగా నాటకరంగానికి నూతన ఆలోచనలు అందిస్తున్న ప్రజాసాంస్కృతికోద్యమ నేత అదృష్టదీపక్. నాటక రంగ కృషీవలుడిగా 2008లో రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారాన్ని అందుకున్న అదృష్టదీపక్ నేటి భారతం చిత్రంలోని మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం.. అనే గీతానికి ఉత్తమ గేయరచయితగా ప్రతిష్టాత్మక మద్రాస్ కళాసాగర్ అవార్డును 1984లో స్వీకరించారు. చరిత్ర ఉపన్యాసకునిగా 2008 వరకు అధ్యాపక వృత్తిని నిబద్ధతతో, విద్యార్ధులకు మంచిని బోధించాలనే లక్ష్యంతో పని చేసిన అదృష్టదీపక్ 2003లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డును అందించింది. ఆయన ఎన్నో పురస్కారాలను ప్రముఖ సంస్థల ద్వారా ఉత్తమ వేదికలపై ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. సామాజిక సమస్యలకు ప్రతిస్పందించే హృదయ సౌకుమార్యం అదృష్టదీపక్‌కు ఉందనడంలో అతిశయోక్తిలేదు. అభ్యుదయ కవితా ప్రపంచంలో రామచంద్రపురానికి ఒక విశిష్ట స్థానాన్ని కల్పిస్తున్న అదృష్టదీపక్‌ను సాహితీ అభిమానులు ఎందరెందరో ఎక్కడెక్కడి వారో అభినందించడం విశేషం.
3-9-2010
‘Adrusta Deepak’
సాక్షి-దినపత్రిక, 23/11/2009 తేది సంచిక నుండి
సాక్షి-దినపత్రిక, 20/2/2010 తేది సంచిక నుండి
సాక్షి-దినపత్రిక, 12/4/2010 సంచిక నుండి
EENADU 10-5-2010
Eenadu 12-5-2010
Saakshi 12-5-2010
Click on image to view large image.
Saakshi, 16-5-2010
...................................................................................................
Eenadu-Aadivaram,16may2010
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=64072&Categoryid=5&subcatid=15#sthash.0uInYpfl.dpuf

Arasam award to be given to film writer today
The Hindu, 23/11/2009
VISAKHAPATNAM: Noted film writer Adhrusta Deepak has been chosen for the award instituted in the name of Puripanda Appala Swamy a nationalist.
Puripanda Appala Swamy is also the founder of Progressive Writers Association (Arasam).
The award function is being organised under the aegis of Arasam.
It will be held at the valedictory of the ongoing 10th Visakha Book Festival at Turner’s Choultry on Monday. Prof Chandu Subba Rao will preside. Former MLA Maanam Anjaneyulu will be the chief guest. Writer Chalasani Prasad, Dr. D.V. Surya Rao, Devarakonda Sahadeva Rao and J.V. Satyanarayana Murthy would attend.
‘Adrusta Deepak’ conferred Puripanda awardSpecial Correspondent- The Hindu‘Adrusta Deepak’
VISAKHAPATNAM: ‘Adrusta Deepak’, poet, columnist, mimic, singer and the lyricist, who had penned the popular film song ‘Maanavatvam parimalinche manchi manasuku swaagatham’ (welcome to the soul, spreading the fragrance of humanism), was conferred with the prestigious Puripanda Appalaswamy Award at a meeting organised by the Visakhapatnam unit of ‘Arasam’ (progressive writers association) at Turner Choultry here on Monday. Speakers who included Manam Anjaneyulu, former MLA, Chandu Subbara Rao, writer, literary critic ands a retired professor, Virayala Lakshmipathi, secretary Arasam, recalled the commitment of Adrusta Deepak to the ideals he cherished right from his young days. The meeting was organised as part of Sri Sri centenary celebrations.
In his response, Adrusta Deepak, recalled his association with Visakhapatnam including his first meeting with Sri Sri in a hotel room here and how he was thrilled beyond words. He also recalled how he was influenced by his teacher, Vijayakumar, who first explained to him the essence of Marxism and dialectical materialism.
Abhyudaya Spoorthi Pursakarams were also given to a number of persons including, C.S.Rao, president Praja Spandana, who had contributed for the good of the society selflessly.
The Hindu-24/11/2009
సాక్షి-దినపత్రిక, 23/11/2009 తేది సంచిక నుండి
సాక్షి-దినపత్రిక, 20/2/2010 తేది సంచిక నుండి
సాక్షి-దినపత్రిక, 12/4/2010 సంచిక నుండి
EENADU 10-5-2010
Eenadu 12-5-2010
Saakshi 12-5-2010
Click on image to view large image.
అభ్యుదయ పాటల దీపం!
-ఎం.డి.
ఆంధ్రభూమి - వెన్నెల
బుక్రివ్యూ..., May 6th, 2010
ఆశయాల పందిరిలో
(అదృష్ణ దీపక్ సినిమా పాటలు)
పేజీలు: 64, ధర 30 రూపాయలుప్రతులకు:
* ఆలోచన సాహిత్య వేదిక
305, ప్రగతి టవర్స్, వీరయ్యవీధి,
మారుతీనగర్, విజయవాడ-520 004
* ఎస్. అదృష్టదీపక్
శివాలయం దక్షిణం వీధి
రామచంద్రపురం-533 255
తూ.గో.జిల్లా.
---------------------------------
మనసుకు హాయినిస్తూ, చెవులకు ఇంపుగా ఉంట, ఆ పాటలను ఆలకించని శ్రోతలుంటారా? పాటలకు అర్థ గౌరవాన్ని, భావ సౌందర్యాన్ని ఆపాదించి ప్రేక్షకుల తలలు నాగపడగలా ఊగేలా చేసేవారు పాటల రచయితలు. వారి ప్రతిభకు మంచి సంగీత దర్శకుడు తోడైతే పాలకు తేనె కలిసినట్లే! గతంలో అనేకమంది పాటల రచయితలు, పాటలంటే అభిమానించే స్థాయిలో రాసారు. కానీ ఇప్పుడు వస్తున్న పాటలు వింటే, అసలివి పాటలేనా? అనే అనుమానం రాకమానదు. అందుకే అలనాటి గీత రచయితలు శ్రోతల పెదాలపై తమ పేరును నిలుపుకున్నారు. గతమంతా ఘనకీర్తి కలిగిన తెలుగు పాట గంగానదిలా పాతాళానికి వెళ్లిపోతుంది. గత కాలపు రచయిత స్థానానికి తూగగలిగే గీత రచయితలు ఇప్పుడు ఎవరూ కనిపించడంలేదు. ఏదో పిచ్చివాడి లల్లాయి పదాలను బాణీలలో ఇరికించి, సంగీత దర్శకులు పళ్లు ఇగిలిస్తున్నారు. కళ అంటే గౌరవం లేని విధంగా పాటలను రాస్తున్నారు. బాణీలు కడుతున్నారు. పాడేవాళ్లు పాడేస్తున్నారు. పాటకు స్వర్ణయుగమనదగిన గత కాలపు పాటల రచయితల సరసకు చేరగలిగిన రచయిత అదృష్టదీపక్.
చాలా తక్కువ పాటలు రాసినా, వాసిలో గొప్ప పాటలుగా వుంటాయ. ఆయన పాటలు. దాదాపు అభ్యుదయ దృక్పథంతో ఆయన తన మార్కు పాటలు రాసారు. ఆయన రచించిన తన పాటల పందిరిని ‘ఆశయాల పందిరిలా’గ తీసుకువచ్చారు. సినిమా రంగం ఒక మాయాబజారు. అందులో చిక్కుకుంటే అన్ని విలువలు వదిలేసి వలువలు లేని స్ర్తిల సౌందర్యాన్ని వర్ణిస్తూ పాటలు రాయాలి. అటువంటి పనులకు అదృష్టదీపక్ కొమ్ము కాయలేదు. పరిశ్రమలో నిలదొక్కుకోవడం, పద్మవ్యూహంకన్నా దుర్భేద్యమైనదని శ్రీశ్రీగారే సెలవిచ్చారు. అది తెలిసిన దీపక్ పాటలు రాస్తానని ఏనాడూ ఏ ఆఫీసులకు వెళ్లలేదు. ‘ప్రాణం’ అనే కవితా సంపుటాన్ని చదివిన ఎర్రచిత్రకారుడు మాదాల రంగారావు దీపక్‌ను చిత్రపరిశ్రమకు ఆహ్వానించి పాటల రచయితగా పరిచయం చేసారు. తరవాత రోజుల్లో ఆచార్య ఆత్రేయ, శ్రీశ్రీ మెచ్చుకునే గీత రచయితగా ఎదిగారు. ఓ నాలుగైదు పాటలు తప్పించి మిగతా అన్ని పాటలు సామాజిక బాధ్యతతో రాసినవే! విద్యార్థి దశనుండి వామపక్ష భావజాలంతో కూడిన గీతాలే ఎక్కువగా రాసారు. సినిమా పాట రాయడం తన వృత్తి కాదని ప్రవృత్తి మాత్రమేనని సగర్వంగా చెప్పుకున్నారు. ఈ గ్రంథంలో మొత్తం 40 పాటలతో పందిరి వేసారు. అన్ని పాటలు ఎర్రమల్లెల గుబాళింపు వెదజల్లేవే! ‘అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు ఎన్నాళ్లనీ ఎనే్నళ్లని నిలదీసినదీ రోజని’ మేడే గూర్చి ‘ఎర్రమల్లెలు’(1981) చిత్రంలో రాసారు. ఆ పాట తర్వాత ప్రతి మేడేకి అదే ముఖ్యమైన పాటల వాడవాడలా వినిపిస్తుంది. ప్రేక్షకులు ఆ పాటకు అంత గౌరవం ఇచ్చారు.
భావనలో నవచేతన పదనెక్కిన ఆలోచన రేపటి ఉదయంకోసం రెప్పలు విప్పాయని బిగిసిన పిడికెళ్ల సాక్షిగా చెప్పారు. శ్రమజీవులు ఐక్యంగా కదనానికి కదలాలని ఈ పాటలో చెబుతారు. ప్రతిపాట వెనుక ఆ పాటకున్న నేపథ్యాన్ని చక్కగా పొందుపరిచారు. ఇదొక కొత్త ప్రయోగమనే అనిపిస్తుంది. ‘అక్షరాలీవేళ అగ్ని విరజిమ్మాలి..్భవాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి’ అనే పల్లవిలో దీపక్ సామ్యవాద వాదనలు తొంగిచూస్తాయి. ఈ నేపధ్యాలలో తనకెదురైన ఆషాఢభూతులు, గోముఖ వ్యాఘ్రాల గురించి కూడా ఆయన పాట నేపథ్యకథనంలో వివరించారు. గుంటనక్కలా పక్కవాడి సొమ్మును, ప్రతిభనుదోచుకునే అనేకమంది సినిమావాళ్ల పెత్తందారీ తనాన్ని, పక్కవాటు దొంగతనాలను తెలిపారు. సినిమాలో ఏదైనా చేయాలని ప్రయత్నించే వారికి అదొక సాలెగూడులాంటిదన్న విషయాన్ని తెలిపారు. ఎంతోమంది ప్రతిభ వున్న కళాకారులు, గళాకారులు, రచయతలు, భజనపరులు అనబడే తిమింగలాలతో కూడిన సముద్రంలో మునిగిపోయారు. వారి ప్రస్థానం ఆగిపోయి, చైతన్య హీనులైపోయారు. చివరికి ఎవరికీ ఏ విధంగా పనికి రాక అదృశ్యమైపోయారని వివరించారు. పాటలు రాసినప్పుడు అది దర్శకులకు నచ్చినా, పక్కనున్న వందిమాగధులు బాలేదని, ఆ పాట, మాట తీసివేయమన్నప్పుడు, సమయానికి వచ్చి ఆ పదాల గొప్పదనాన్ని తెలిపేవారు వుండాలని కొన్ని సందర్భాలను ఈ పుస్తకంలో చూస్తాం. ‘ఏడుమల్లెల ఎత్తు’ ‘సామ్యవేదం’ వంటి పద ప్రయోగాలు ఈ పాటల్లో కనిపిస్తాయి. అవి విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయని పాటల నేపథ్యంలో రచయిత వివరించారు.
ఎంత గొప్ప రచయిత అయినా బూతుపాటలు రాయనంటే, అతన్ని మరో పాట రాయమని అడగరు. అవి రాయలేకపోతే అతని కెరీర్ ప్రమాదంలో పడ్డట్టే! ‘మా ఆయన బంగారం’ చిత్రంలో రాసిన ఓ చెత్త గీతంతో ఈ పాటలు రాసే పనిని కట్టిపెట్టానని చెబుతున్నారు. నేను సైతం ఈ లోకానికి బూతు పాటలు రాయలేక అవస్థలు పడ్డానని ఆయన తన స్వగతంలో చెప్పుకున్నారు. తరువాత ఎవరైనా పాటలు రాయడానికి పిలిస్తే ఏదో సాకుచెప్పి రాయలేదని కూడా తెలిపారు. ఇప్పటి రికార్డింగు దశలోనే పాట తన ఆత్మను కోల్పోతుందన్న ఆయన మాట నిజం. ఎవరో ఓ సంగీత వాయిద్యం వాయించి వెడతారు. మరొకరు మరో వాయిద్యం. సినీ కోకిలలు అని పిలుస్తున్న గాయకులు వచ్చి ఆ పదాలను పలికి వెళతారు. సంగీత దర్శకుడు అతుకులన్నీ అంటించి ఓ పాటను తయారుచేస్తాడు. ఇదే నేటి పాటల పరిస్థితి. అందుకే వాటిలో ఆత్మ లేదనడం సబబే! గంగిగోవు పాట గరిటెడైనను చాలు అన్నట్లు, అదృష్ట దీపక్ పాటలు కొద్దివైనా చాలు. అందులో మానవత్వం పరిమళించే మనిషికి స్వాగతం (నేటి భారతం) ఒక పాట చాలు. ఆయనలో ప్రతిభను మనం తెలుసుకోవడానికి, ఆయన పాట ఎన్ని కాలాలైనా బతికి వుండే పాట! మానవత్వపుతేట. మకరందపుతోట!
-----------------------------------------------------------

సమకాలీన పరిస్థితులకుఎక్స్-రే ఈ పాట!
సాహిత్య
ప్రక్రియలన్నింటిలోనూ పాట చాలా పదునైన ఆయుధం! అనేక సినిమాలలో రచయిత,
దర్శకుడు కలసి నాలుగు సన్నివేశాల ద్వారా స్పష్టంగా చెప్పలేకపోయిన
విషయాన్ని, నాలుగు నిమిషాల పాట ద్వారా చక్కగా వ్యక్తీకరించగలుగుతారు.
అందుకే బాక్సాఫీసు సూత్రాలలో పాట ప్రముఖ స్థానం సంపాదించుకుంది. ధనార్జన
ఒక్కటే ధ్యేయంగా మారిన పెట్టుబడిదారీ సంస్కృతిలో నేటిసినిమా పాట
శబ్దకాలుష్యంతోను, అనేక పదప్రయోగాలతోను నిండి, పాతాళానికి పరుగులు
తీస్తోంది. మంచి పాట అనేది విన్నప్పడు కాదు- చదివినప్పడు కూడా హృదయాన్ని
స్పందింపజేయాలి. మనలో ఉత్తమసంస్కారాన్ని, ఉదాత్త భావాలను ప్రదీప్తం
చెయ్యాలి. అలాంటి గీతాలలో ఒకటి... మహాకవి శ్రీశ్రీ రచించిన ‘పాడవోయి
భారతీయుడా’ (వెలుగు నీడలు)!
సినీగేయ రచన కేవలం ధన సంపాదనకు దారిచూపే వృత్తిగా మాత్రమే కాకుండా, సామాజిక చైతన్యాన్ని రగిలించే బాధ్యతగా భావించిన శ్రీశ్రీ కలం నుంచి ఎన్నో ఉత్తమ గీతాలు వెలువడ్డాయి. అలాంటి వాటిలో తలమానికంగా నిలిచే పాట ఇది. ఇందులో ఆయన పేర్కొన్న అంశాలు అయిదు దశాబ్దాలు గడచినా, ఇప్పటికీ ప్రాసంగికతను కోల్పోలేదు. 1961లో విడుదలైన అన్నపూర్ణ వారి ‘వెలుగునీడలు’ చిత్రంలో ‘పాడవోయి భారతీయుడా/ ఆడి పాడవోయి విజయ గీతికా/ నేడే స్వాత ంత్ర దినం/ వీరుల త్యాగఫలం/ నేడే నవోదయం/ నీదే ఆనందం’ అని మొదలయ్యే నృత్య రూపకంలో శ్రీశ్రీ ఆనాటి స్వతంత్ర భారతంలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వర్ణించారు. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చినా, కల్లాకపటం తెలియని జనం మోసపోతూనే ఉన్నారు. అధికార పార్టీల ప్రచార ఆర్భాటాలు, ఆచరణకు నోచుకోని అసందర్భ ప్రసంగాలు ప్రజలనెత్తిన శఠగోపం పెడుతున్నాయి. సామాన్యుడి జీవితం ‘ఇంట్లో ఈగల మోత - వీధిలో పల్లకీ మోత’లా తయారైంది. అందుకే శ్రీశ్రీ ఈ పాట మొదటి చరణంలో ‘స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి/ సంబర పడగానే సరిపోదోయి’ అని హెచ్చరిస్తున్నారు. ‘సాధించిన దానికి సంతృప్తిని పొంది/ అదే విజయమనుకొంటే పొరపాటోయి/ ఆగకోయి భారతీయుడా/ కదలి సాగవోయి ప్రగతిదారులా’ అంటూ ప్రబోధిస్తున్నారు. అర్థంకాని పదాలు కానీ క్లిష్లమైన సమాసాలు కానీ లేకుండా స్వచ్ఛమైన ప్రజల భాషలో గుండె తలుపులు తడుతున్నారు. ‘ఆకాశం అందుకొనే ధరలొకవైపు/ అదుపులేని నిరుద్యోగమింకొకవైపు/ అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు/ అలముకొన్న నీ దేశం ఎటుదిగజారు?/ కాంచవోయి నేటి దుస్థితి/ ఎదిరించవోయి ఈ పరిస్థితి’ అనే చరణం ప్రస్తుత అస్తవ్యస్త సమాజానికి అక్షరాలా అద్దంపడుతోంది. ‘పదవీ వ్యామోహాలు, కులమత బేధాలు/ భాషా ద్వేషాలూ చెలరేగె నేడు/ ప్రతిమనిషీ మరియొకనీ దోచుకునేవాడే/ తన సౌఖ్యం, తన భాగ్యం చూచుకొనేవాడే/ స్వార్థమే అనర్థకారణం/ అది చంపుకొనుటె క్షేమదాయకం’ అనే చరణం కూడా నేటి సమకాలీన భారతదేశానికి తీసిన ఎక్స్-రేలా కనిపిస్తుంది. పాట పొడవునా దుష్ట సమాజపు వికృత రూపాన్ని చీల్చిచెండాడిన శ్రీశ్రీ, చివరి చరణాన్ని మాత్రం ప్రగతిశీల దృక్పథంతోను, గొప్ప ఆశావాదంతోను ముగించారు. ‘సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం/ సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం/ ఏకదీక్షతో గమ్యం చేరిననాడే/ లోకానికి మన భారతదేశం/ అందించునులే శుభసందేశం’ అంటూ ఈ పాటకు ముగింపు పలుకుతూ, నేటి తరానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఒకసారి మిత్రుడు మాదాల రంగారావు ‘స్వరాజ్యం’ సినిమాలో తనకు కావలసిన పాటకు సందర్భాన్ని వివరించి, ‘‘నువ్వు రాసే పాట శ్రీశ్రీ ‘పాడవోయి భారతీయుడా’ అనే పాట స్థాయిలో ఉండాలి. అలాగని ఎక్కడా ఆ పాట ఛాయలు కనిపించకూడదు’’ అన్నారు. అప్పుడు నేను ‘ఇది తినడానికి తిండిలేని స్వరాజ్యం/ మనది అనడానికి స్వేచ్ఛలేని స్వతంత్రం’ అంటూ రాశాను. ఆ పాటకు స్ఫూర్తి ‘పాడవోయి భారతీయుడా’యే! తెలుగు సినిమా పాటకు ఎంతోకాలం అందని పండులా మిగిలిపోయిన జాతీయ పురస్కారాన్ని మహాకవి శ్రీశ్రీ - ‘అల్లూరి సీతారామరాజు’లో ‘తెలుగు వీరలేవరా’ పాటతో సాధించి, తెలుగు సినిమా కీర్తిపతాకాన్ని సగర్వంగా ఎగరేశారు. నిజానికి ‘వెలుగు నీడలు’ (1961) విడుదలైన నాటికి ఈ అవార్డు ఉంటే, అది ఈ పాటకు కచ్చితంగా లభించి ఉండేది! - సేకరణ: సమీర నేలపూడి sakshisong@gmail.com |

No comments:
Post a Comment