Pages

Monday, August 13, 2012

దీపకరాగం - ఆరు పదుల అగ్నిగీతం


అదృష్టదీపక్
జనవరి 18, 2010 కవి, సినీ గీతరచయిత అదృష్టదీపక్ షష్టిపూర్తి
అదృష్టదీపక్ - ఎంత పొయెటిక్ పేరు! అ - దృష్టం అంటే కనపడనిది అలాగే అరవైల్లోకి వచ్చిన అదృష్టదీపక్ కూడాసముద్రాన్ని కమండలంలోఇమిడ్చేసిన రుషిలాగ పైకి కనపడడు! తక్కువే రాస్తాడు - ఎక్కువగా గుర్తుండిపోయే లాగ! అతనో చల్లని అగ్ని పర్వతంవెచ్చని హిమాలయంగులాబీ లా కనిపించే విచ్చుకత్తిమొగలి రేకులా అనిపించే మల్లెపువ్వు సగం నెత్తురుతోనూ, సగం కన్నీళ్ళతోనూ రాస్తాడు విమర్శ మాత్రం గండ్రగొడ్డలితో రాస్తాడని నా అనుమానం! అతను ఎత్తుపల్లాల్ని ఎక్కి దిగిన మనిషి
మానవత్వం పరిమళించే మంఛి మనసున్న మనిషి’

అతనెప్పుడూ వీరబాహుడిలాగభుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడుఎవరన్నా అభిప్రాయం అడిగితే నిర్మొహమాటంగాకుండని మొహాన భళ్ళున కొడతాడు!నిజం చెప్పడం అతని వ్యసనందాని వల్ల అతను చాలా దెబ్బలు తిని ఉండొచ్చుకానీప్రతి దెబ్బా అతని పాలిట గోల్డ్ మెడల్ కదా!ఎంచేతంటే వీరుణ్ని ఎప్పుడైనా మనం గాయాలతోనే కదా గుర్తించాలి!అతని స్నేహం తియ్యని మధురానుభూతుల ప్రవాహం!అతనితో మాట్లాడుతుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతుంటాయిచుట్టూ ఉన్న వాతావరణాన్ని జిగేల్ మని వెలిగించే సంభాషణాచాతుర్యంఅతనిది!సాహిత్యంలో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లోనూ అతను ప్రవేశించాడుకేవలం ప్రవేశించడమే కాదు-వచన కవిత రాసినా, ఉద్యమ గీతం రాసినా,సినిమా పాట రాసినా, విమర్శనా వ్యాసం రాసినాతనదైన ముద్ర బలంగా కొట్టాడుకవిగా, కధకుడిగా, విమర్శకుడిగా,వక్తగా, అధ్యాపకుడిగా, నాటక న్యాయనిర్ణేతగాఅతను ‘షణ్ముఖుడు’ !నాటకం చూస్తున్నప్పుడు అతనో విలన్పోటీల రిజల్ట్ చెప్పేటప్పుడు అతనో జెంటిల్ మన్బహుమతీ ప్రదానం అయిపోయాక అతను హీరోమనసా - అతను ఏది చేసినా ఇష్టంగానే చేస్తాడువాచా - అతను నమ్మిన విషయాన్నే చెప్తాడుకర్మణా - కొంపలు మునిగిపోతున్నా తాను నమ్మినదాన్నే ఆచరిస్తాడుఅసలైన వ్యక్తిత్వం అంటే అదే మరి!రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు ఇచ్చినాసినిమా రంగం ‘కళాసాగర్’ అవార్డు ఇచ్చినాఅతని ఆలోచనలు ఎప్పుడూ నేలమీదే నడుస్తుంటాయిఅతని కళ్ళు నిరంతరం జీవితాన్నే చదువుతుంటాయిఅందుకే అదృష్టదీపక్ అంటే నాకు ఎంతొ ఇష్టం!అతనికి అరవై ఏళ్ళంటే నమ్మటం చాలా కష్టం!!
-తనికెళ్ళ భరణి

- అదృష్టదీపక్ షష్టిపూర్తి సందర్భంగా -
‘సాక్షి’ దినపత్రిక
17/01/2010 తేది ఆదివారం సంచికలో ప్రచురించిన తనికెళ్ళ భరణి రచన...
......................................................................



దీపకరాగం


           అదృష్టదీపక్ - స్వరాజ్యం
పేరు:               s.అదృష్టదీపక్      
పుట్టిన రోజు:       18-1-1950
చిరునామా:        శివాలయం దక్షిణం వీధి,
                     రామచంద్రపురం -533255
                     తూర్పు గోదావరి జిల్లా
చరవాణి :           94405 28155
వృత్తి:                విశ్రాంత చరిత్ర అధ్యాపకుడు
ప్రవృత్తి:             సాహిత్య, కళారంగాలు
బ్లాగ్లు:                http://adrustadeepak.blogspot.in/
                         http://adrushtadeepak.blogspot.in/   

   వామపక్ష భావజాలంతో నిండిన కుటుంబంనుంచి
వచ్చిన అదృష్టదీపక్  విద్యార్థి  దశనుంచీ చేసిన కృషి
ఫలితంగా వీరి కవితలు, పాటలు, కథలు, వ్యాసాలు,
సాహిత్య విమర్శలు ఆంధ్రదేశంలోని ప్రముఖ పత్రికలన్నీ
ప్రచురించాయి.

విశాలాంధ్ర, స్వాతి, వికాసం, మొదలగు పత్రికలూ,
సంస్థలూ నిర్వహించిన పోటీలలో ఉత్తమ కవిగానూ,
ఉత్తమ కథారచయితగానూ బహుమతులు పొందారు.

ప్రచురిత గ్రంథాలు:
౧. కోకిలమ్మ పదాలు (1972)   ౨. అగ్ని (1974)
౩. సమర శంఖం(1977)          ౪. ప్రాణం (1978)
౫. అడవి (2008)                ౬. దీపకరాగం (2008)
౭. ఆశయాల పందిరిలో (2010)  ౮. శ్రీశ్రీ ఒక తీరని దాహం (2010)


ఇవికాక అనేక ప్రసిద్ధ సంకలనాలలో వీరి రచనలు
చోటుచేసుకున్నాయి. బెర్ట్రోల్డ్ బ్రెహ్ట్, పాబ్లో నెరూడాల
కొన్ని కవితలను తెలుగులోకి అనువదించారు.
‘ఉదయం’ దినపత్రికలో ఒక సంవత్సరం ప్రతి
ఆదివారం ‘పదసంపద’శీర్షిక నిర్వహించారు.
విజయవాడనుంచి వెలువడుతున్న ‘చినుకు’
మాసపత్రికలో మూడేళ్ళపాటు ‘దీపకరాగం’
శీర్షిక నిర్వహించారు. ప్రస్తుతం ‘సాక్షి’ దినపత్రిక
ఆదివారం అనుబంధం ‘ఫన్ డే’లో ప్రారంభ
సంచికనుంచీ ‘పదశోధన’శీర్షిక నిర్వహిస్తున్నారు.

ఎన్నో నాటక కళాపరిషత్తులలో ఉత్తమ నటుడు,
ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ కేరక్టర్ నటుడు
మొదలగు అవార్డులు పొందారు.

గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక
ప్రముఖ నాటక కళాపరిషత్తులలో న్యాయనిర్ణేతగా
బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్
యూత్ ఫెస్టివల్స్ లో - నాటికలు, లలితసంగీతం,
బృందగానాలు మొదలగు అనేక అంశాలకు
న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

ఆకాశవాణి, దూరదర్శన్ లు అదృష్టదీపక్
కథలూ, కవితలూ, కార్యక్రమాలూ ఎన్నోసార్లు
ప్రసారం చేశాయి. కొన్ని కవితలను ప్రముఖ కవి
నిర్మలానంద వాత్సాయన్ హిందీలోకి
అనువదించారు.

1980లో మాదాల రంగారావుద్వారా
‘యువతరం కదిలింది’చిత్రంలో
‘ఆశయాల పందిరిలో’గీతరచనతో
సినిమా రంగ ప్రవేశం చేశారు.

ఇంకా విప్లవశంఖం, నవోదయం, నేటిభారతం,
దేశంలో దొంగలుపడ్డారు, ప్రజాస్వామ్యం,
నవభారతం, భారతనారి, ఎర్రమందారం,
అన్న, మా ఆయన బంగారం, దేవాలయం,
వందేమాతరం. అర్ధరాత్రి స్వతంత్రం,
కంచుకాగడా, జైత్రయాత్ర, స్వరాజ్యం,
బదిలీ, సగటుమనిషి, నవయుగం,
మొదలగు అనేక విజయవంతమైన
చిత్రాలలో గీతరచన చేశారు.

అదృష్టదీపక్ కృషికి గుర్తింపుగా
ఎన్నో అవార్డులూ, రివార్డులూ
లభించాయి.
1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్
దయాళ్ శర్మ ద్వారా ‘నేటిభారతం’
చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి
మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ
రచయితగా మద్రాసులో ‘కళాసాగర్’
అవార్డు
(1984)

2. ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు
నాయుడుద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ
అధ్యాపక అవార్డు
(2003)

3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ
వేడుకలలో కవిసత్కారం (2003)

4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్
వారి ‘కళానిధి’ అవార్డు, మరియు
సాహితీ పురస్కారం
(2004)

5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్
కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత
శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం
మరియు ఉగాది పురస్కారం
(2005)

6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్
శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీ జక్కంపూడి
రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్.
కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)

7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా
సమీక్షా సంఘ సభ్యునిగా
నియామకం (2006)

8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన
నంది నాటకోత్సవాలలో  అభినందన
సత్కారం
(2008)

9. అభ్యుదయ రచయితల సంఘం, విశాఖ శాఖ
అధ్వర్యంలో టర్నర్ చౌల్ట్రీలో జరిగిన మహాకవి
శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో ‘పురిపండా సాహితీ
పురస్కారం’
(2009)

10. కాకినాడ, అల్లూరి సీతారామరాజు
కళావేదిక రజతోత్సవాలలో ‘అల్లూరి సీతారామరాజు
స్మారక పురస్కారం’
(2010)

11. విజయవాడ, ఎక్స్ - రే అధ్వర్యంలో జరిగిన
మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో ‘శ్రీశ్రీ
సాహితీ పురస్కారం’
(2010)

12. గుంటూరు జిల్లా, అరసం అధ్వర్యంలో
‘కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ
పురస్కారం’
(2010)

13. హైదరాబాదు, పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం వారిచే ‘సృజనాత్మక సాహిత్యం’
లో ‘కీర్తి పురస్కారం’ (2010)

14. ‘కవిరాజు త్రిపురనేని రామస్వామి - నార్ల
వెంకటేశ్వర రావు’ ‘వారసత్వ సెక్యులర్
అవార్డు’
(2011)

15. విశాఖపట్నం, కళాభారతి ఆడిటోరియంలో
జాలాది కల్చరల్ ట్రస్ట్ వారిచే ‘జాలాది
సాహితీ పురస్కారం’
(2012)

16. కొత్తపేటలో నన్నయ విశ్వవిద్యాలయం
వైస్ - చాన్సలర్ శ్రీ జార్జి విక్టర్ ద్వారా ‘శ్రీనాథ
రత్నశిల్పి వుడయార్ కళాపురస్కారం’
(2012)

17. కాకినాడ సూర్యకళామందిరంలో రాష్ట్ర
మంత్రి శ్రీ తోట నరసింహం ద్వారా ‘తెలుగు
నాటకరంగ దినోత్సవ పురస్కారం’
(2013)

అవార్డులూ రివార్డులూ :

1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా ‘నేటిభారతం’ చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో ‘కళాసాగర్’ అవార్డు (1984)


2. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)


3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003)


4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి ‘కళానిధి’ అవార్డు మరియు సాహితీ పురస్కారం (2004)


5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం మరియు ఉగాది పురస్కారం (2004)


6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)


7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006)

8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008



కృత్తివెంటిపేర్రాజు పంతులు జాతీయ పాఠశాల శతాబ్ది ఉత్సవాలలో
సన్మాన గ్రహిత
దీపక్ .....












కొత్తపేటలో శ్రీనాథరత్నశిల్పివుడయార్ కళాపురస్కారాన్ని
అదృష్టదీపక్ అందుకున్న సందర్భంగా..
(30-11-2012)
                                              


కొత్తపేటలో శ్రీనాథరత్నశిల్పివుడయార్ కళాపురస్కారాన్ని
అదృష్టదీపక్ అందుకున్న సందర్భంగా..
(30-11-2012)




నాగురించి నేను.......
అదృష్టదీపక్
నేను 1950 జనవరిలో 18తేదీన పుట్టాను. కాశీమజిలీ కధలు రెండవ భాగంలో అదృష్టదీప చక్రవర్తి కధ ఉంది. దేవుళ్ళపేరు కాకుండా, వైవిధ్యంగా ఉంటుందని, కమ్యూనిస్టు అయిన మా మేనమామ నాకు ఆ పేరు పెట్టాడు.
మా ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం. నా బాల్యంలో మొదటి పది సంవత్సరాలూ అక్కడే గడిచాయి. రావులపాలెం-జొన్నాడల మధ్య గోదావరి నది మీద వంతెన నిర్మించిన తరువాత, కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం, రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఒకటిగా మారిపోయింది.
వంతెన నిర్మించకముందు ఆ ఊరు నా బాల్యంలో నాగరికతకు దూరంగా, బయటి ప్రపంచంతో అంతగా సంబంధాలు లేకుండా, అనేక విషయాలలో ఫ్యూడల్ అహంకారాలకు నిలయంగా ఉండేది. రవాణాసౌకర్యాలు చాల తక్కువగా ఉండేవి. పండగల్లోనూ, వేసవి సెలవుల్లోనూ అమ్మతో కలసి రామచంద్రపురం తాలూకాలోని మా మేనమామగారి ఊరు మాచవరంలో గడిపేవాణ్ని. ఈవేళ రావులపాలెం నుంచి, ప్రస్తుతం నేను స్థిరపడిన రామచంద్రపురం పట్టణానికి సరిగ్గా 45నిమిషాల ప్రయాణం. కానీ నా బాల్యంలో ఒకపూట సరిపోయేది కాదు. రావులపాలెంలో నావమీద గోదావరి దాటి, జొన్నాడ రేవులో దిగి, ఆలమూరు వరకూ నడచి, అక్కడ రామచంద్రపురంవైపు వెళ్ళే బస్సు ఎక్కేవాళ్ళం. వేసవి కాలంలో గోదావరిలో నీళ్ళు బాగా తగ్గిపోయినప్పుడు నావలు తిరిగేవి కావు. నీళ్ళు తగ్గిన రేవులను ‘పాటిరేవు’లని పిలిచేవారు. ఆ సమయంలో అవతలి గట్టుకు చేరాలంటే పాటిరేవులో మొలలోతు నీళ్ళలో దిగి నడవాలి. అలవాటులేని ప్రాంతాలలో నీటిలో దిగితే ఊబిలో కూరుకుపోయే ప్రమాదాలు సంభవించేవి. ఇసుకతిప్పల మీద మొలచిన రెల్లుదుబ్బుల మధ్య పరుగులెత్తే కృష్ణజింకలను చూడటం నా బాల్యంలో మరపురాని అనుభవం.
గోదావరి మీద వంతెన నిర్మించడానికి పనివాళ్ళు ప్రత్యేకంగా కేరళనుంచి వచ్చారు.

వాళ్ళ ఆచారవ్యవహారాలు మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేవి. ముఖ్యంగా- వంటల్లో కొబ్బరినూనె ఉపయోగించడం మాకు వింతగా ఉండేది. వారానికోరోజు పడవ మీద ఉప్పు వచ్చేది. ఊళ్ళోజనం కాలువ దగ్గరకు వెళ్ళి పడవమీద ఉప్పు కొనేవారు. ఒక అర్ధణాకు కుంచం నిండా ఉప్పు ఇచ్చేవారు. (రూపాయకు 32). మాఊరికి ఐదుమైళ్ళ దూరంలోని తాలూకా కేంద్రం కొత్తపేటలో సినిమాహాలు ఉండేది. సినిమా మారితే మైకులో పాటలు వేస్తూ, వాల్ పోస్టర్లు అంటించిన గుర్రబ్బండి ప్రచారానికి వచ్చేది. మైకులో పాటలు వినిపించిన వెంటనే పిల్లలంతా సినిమా బండికి ఎదురువెళ్ళి, బండివాడు విరజిమ్మే కరపత్రాలు ఏరుకుంటూ, ఊరు దాటేవరకూ బండివెంట పరుగులు తీసేవాళ్ళం!

కాలువగట్టునే కచేరీచావడి దగ్గర రెడ్డిగారి హోటల్ లో రెండు అణాలకు ప్లేటు ఇడ్లీ, టీ ఇచ్చేవారు. (రూపాయకు 16 అణాలు). ఇళ్ళలో రెగ్యులర్ గా కాఫీ,టీలు కాచుకునేవారు కాదు. బంధువులు రావడంలాంటి ప్రత్యేక సందర్భాల్లో అర్ధణా పెట్టి టీ పొట్లం కొని, టీ కాచుకొని ఇంట్లో అంతా తాగేవారు. రెడ్డిగారి హోటల్ కి ఆంధ్రప్రభ దినపత్రిక వచ్చేది. ప్రతిరోజూ ఖాళీసమయాల్లో ఒకాయన పెద్దగొంతుతో పేపరులో విశేషాలు చదువుతుంటే, అక్కడ చేరినవారంతా శ్రద్ధగా వినేవారు. మామయ్య మా ఊరు వచ్చినపుడు నా చేతికో బేడ ఇచ్చి సిగిరెట్టు పెట్టె, అగ్గిపెట్టె తెమ్మనేవాడు.(రుపాయకు 8 బేడలు). ఆయన కాల్చే డెక్కన్ సిగిరెట్టుపెట్టె ఆరు కానులకూ, అగ్గిపెట్టె అర్ధణాకూ ఇచ్చేవారు. (రూపాయకు 64 కానులు). పిల్లల చిరుతిళ్ళకు ఒక కానీ ఇస్తే గిద్దెడు బఠానీలు వచ్చేవి. మంచి బిస్కెట్లు కానీకి ఒకటి ఇచ్చేవారు. కొంతకాలానికి కాలువ దగ్గర కిళ్ళీకొట్టులోకి, పట్నంనుంచి కాగితంలో చుట్టిన కేకులు తెచ్చి అమ్మేవారు. కేకు ఖరీదు ఒక అణా. అది చాలా ఖరీదైన వ్యవహారం కనుక పిల్లలకు ఎప్పుడైనా అరుదుగా కొనిపెట్టేవారు. ‘కేకు’ని మేము ‘ఇసుకపప్ప’ అని పిలిచేవాళ్ళం!

మాచవరంలో మా మేనమామ ఒక రేడియో కొన్నాడు. చిన్నసైజు ట్రంకుపెట్టెలా ఉండే ఆ రేడియో - కారులకూ, లారీలకూ ఉపయోగించే పెద్ద బేటరీ సాయంతో పనిచేసేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంనుంచి ప్రతి మంగళవారమూ రాత్రి ఎనిమిది గంటలకు ‘కల్పలత’ అనే సినిమా పాటల కార్యక్రమం ప్రసారం చేసేవారు. నెలకోసారి సంక్షిప్త శబ్దచిత్రం(సినిమా) ప్రసారం అయ్యేది. ఆ కార్యక్రమాల కోసం ఇంటిల్లపాదీ ఎదురుతెన్నులు చూశేవారు. అవి శ్రద్ధగా విని నేను ఆ పాటలన్నీ పాడుతుండేవాణ్ని. దసరా సీజన్ లో మాస్టర్లకూ గిలకలు పట్టుకుని తిరిగే పిల్లల్లో నేనే ప్రధాన గాయకుణ్ని. ‘వందేమాతరం’ సినిమాలో నేనురాసిన ‘ఎదయా మీదయా మామీద లేదు’ అనే పేరడీపాటకు నేపధ్యం ఇదే!

1960 అనుకుంటాను- మా ఊరికి ఎలక్ట్రిసిటీ వచ్చింది. అంతవరకూ కిరోసిన్ దీపాలూ, హరికేన్ లాంతర్లూ ఉపయోగించేవాళ్ళం. మామయ్య ప్రోత్సాహంతో మాకు కూడా ‘కరెంటు’ వచ్చింది. మీట నొక్కితే లైటు వెలిగే విచిత్రం చూడటానికి బంధువులంతా మా ఇంటికి రావడం నాకింకా గుర్తుంది. మా ఇంటిదగ్గరే ఉన్న వేణుగోపాలస్వామి గుడి ఆవరణలో చిలువూరి సూర్యనారాయణరాజుగారు తాటాకుల పాక నిర్మించి అందులో ప్రైవేటు పాఠశాల నడిపేవారు. బోర్డు ఎలిమెంటరీ స్కూల్లో పాఠాలు బాగా చెప్పరనే ఉద్దేశంలో (నిజం కూడా) నాకు రాజుగారి పాకబడిలో విద్యాభ్యాసం చేయించారు. విద్యాబోధనకూ, క్రమశిక్షణకూ ఆ బడికి మంచిపేరు ఉండేది. అప్పటిలో ‘హెడ్ మాస్టర్’ అనే పదం మాకు తెలీదు. రాజుగారిని మేము ‘పెద్దమేస్టారు’ అనేవాళ్ళం. ఆయన దస్తూరి ముత్యాలకోవలా ఉండేది.

‘పాకబడిలో’ చదివినవాళ్ళకు ఆరవ తరగతిలో చేరే అవకాశం ఉండదని ప్రచారం జరగడంతో అయిదవ తరగతిలో నేను బోర్డు ఎలిమెంటరీ స్కూల్లో ప్రవేశించాను. మంచి మార్కులు వస్తున్నందున నాకు ‘వేంకట పార్వతీశ్వరకవులు’ రచించిన ‘పిల్లల బొమ్మల భారతం’ పుస్తకం బహుమతిగా ఇచ్చారు. ఆ రోజుల్లోనే ‘చందమామ’ పత్రిక నన్ను బాగా ఆకర్షించింది. నాలో పఠనాసక్తి పెరగడానికి ఈరెండూ బాగా దోహదం చేశాయి.

మా వీధిలో సత్తెమ్మగుడి ముందు ప్రతియేటా సంబరాలు జరిగేవి. సంబరాలు జరిగే మూడురోజులూ పంబలవారు (పంబ అనే వాయిద్యాన్ని ఉపయోగిస్తారు) ‘మాంధాత రాజు’ లాంటి కధలు తెల్లవార్లూ చెప్పేవారు. మధ్యమధ్య నిద్రమత్తు ఆవహిస్తున్న భక్తశ్రోతలను హూషారు చెయ్యడంకోసం చమత్కారమైన పాటలెన్నో పాడేవారు. వాటిలో అప్పుడప్పుడు మొరటు హాస్యమూ, హద్దుమీరిన బూతులు కూడా చోటుచేసికునేవి. వ్యవసాయదారుడైన మానాన్న నిరక్షరాస్యుడైనా భారత, రామాయణాల్లో ఘట్టాలన్నీ నాకు రసవత్తరంగా వర్ణించి చెప్పేవాడు. నేను పుట్టక మునుపే బ్రతుకుతెరువుకోసం బర్మా రాజధాని రంగూన్ వెళ్ళివచ్చాడు. తెలుగులో సంతకం చెయ్యడం రాకపోయినా హిందీ బాగా మాట్లాడేవాడు. ఎంతటివాళ్ళనైనా తన వాక్చాతుర్యంతోనూ, వెటకారాలతోనూ దెబ్బతీసేవాడు. ( నా రచనల్లో కనిపించే వ్యంగ్యానికి స్ఫూర్తి మానాన్నే అని నా నమ్మకం). రామదాసు కీర్తనలూ, అనేక జానపద గీతాలూ అద్భుతంగా పాడేవాడు.

అయిదోతరగతి చదివిన మా అమ్మ ఇరుగుపొరుగు స్త్రీలను అరుగుమీద కూర్చోబెట్టుకొని స్త్రీల పాటలూ, గేయకధలూ పాడి వినిపిస్తూ ఉండేది. బాలనాగమ్మ,ఊర్మిళాదేవి నిద్ర,లక్ష్మణదేవర మూర్ఛ,కుశలవ చరిత్ర మొదలైనవన్నీ పుస్తకం చూడకుండా పాడి వినిపించేది. మా మేనమామ సినిమాపాటల బాణీల్లో రాజకీయగీతాలు రాసి ఒక కరపత్రంగా అచ్చువేసి పంచేవాడు. ప్రజలలో అవి ఎంతగానో పాపులర్ అయ్యాయి. బాల్యంలోని ఈ నేపధ్యమే నన్ను కవిగానూ, కళాకారుడిగానూ తయారుచేసింది.

కేరళలో 1957 కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ విజయోత్సవంలో భాగంగా మాచవరంలో జరిగిన బహిరంగ సభలో మా మేనమామ నాచేత ఒకపాట పాడించాడు. ప్రజలముందు వేదికమీద నిలబడి పాటపాడటం అదే మొదటిసారి. అప్పుడు నా వయస్సు ఏడు సంవత్సరాలు.

1961 మానాన్న ఆరోగ్యం పాడైంది. మేము రావులపాలెంనుంచి మా మేనమామగారి ఊరు మాచవరం వచ్చేశాము. ఇంట్లో లెనిన్ ఫొటో పెట్టుకున్నందుకు కొంతమంది గ్రామపెద్దల కన్నెర్రకు గురైన మేము, స్వేచ్ఛగా అనేక ఇళ్ళమీద ఎర్రజెండాలు రెపరెపలాడే వాతావరణంలోకి ప్రవేశించాము. నేను కొత్తగా సైకిలు తొక్కటం నేర్చుకున్నాను. చదువు నిమిత్తం సైకిలుమీద రోజూ రామచంద్రపురం హైస్కూలుకి వెళ్ళివచ్చేవాడిని. ఇక్కడే నా మెదడు ఎదగడం ప్రారంభించింది. ఇక్కడనుంచే కవిగానూ, కళాకారుడిగానూ నా నడక మొదలైంది.

మా మేనమామ బుర్రకధలు చెప్పేవాడు. నాజర్ లాంటి ప్రజాకళాకారులతో ఆయనకు మంచిసంబంధాలు ఉండేవి. వాళ్ళందరితోనూ సన్నిహితంగా తిరిగే అవకాశం నాకు చిన్నతనంలోనే కలిగింది. ఊళ్ళోని నాటక సమాజానికి దర్శకుడు అయిన మా మేనమామే నాచేత నాటకాల్లో వేషాలు కూడా వేయించేవాడు. ఆత్రేయ రచించిన ‘కప్పలు’ నాటకంలోని పిల్లవాడి పాత్రద్వారా నేను నాటకరంగం మీద అడుగుపెట్టాను.

ఆ రోజుల్లో కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యంలో ప్రతిఏడూ సాహిత్య వారోత్సవాలు నిర్వహించేవారు. అప్పుడుకొన్న ‘పారిపోయిన బఠానీ’ (పిళ్ళా సుబ్బారావు), ‘పేనూ-పెసరచేనూ’(నార్ల చిరంజీవి) పుస్తకాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పుస్తకాలు చదవడం నాలో అభిరుచి స్థాయిని దాటిపోయి పెద్ద వ్యసనంగా మార్పుచెందింది. వేసవి సెలవుల్లో పంచాయితీ బోర్డుగ్రంధాలయంలో పుస్తకాలు- కనీసం రోజుకి రెండయినా చదివేవాణ్ణి.

అప్పుడే నాలో ఏదో రాయాలనే తపన మొదలైంది. ఆ తపన వెనుక అచ్చులో నాపేరు చూసుకోవాలనే కుతూహలం కూడా ఎక్కువే ఉండేది. నా మొదటి రచన 1962 రాజమండ్రినుంచి వెలువడే ‘చౌచౌ’ అనే మాసపత్రిక ప్రచురించింది. అప్పటికి నా వయస్సు పన్నెండు సంవత్సరాలు. మొదటిసారి అచ్చులో నాపేరు చూసుకున్నరోజు, ఆనందంతోనూ, ఉద్వేగంతోనూ సరిగ్గా నిద్రకూడా పట్టలేదు. అప్పటినుంచీ పత్రికలమీద నా దాడి మొదలయ్యింది. జోకర్, బుడుగు, నవ్వులు-పువ్వులు, పకపకలు మొదలైన హాస్యపత్రికలు నా రచనలెన్నో అచ్చువేశాయి. జోకర్, బుడుగు పత్రికలు కొన్ని సంవత్సరాల పాటు ప్రతినెలా నా సీరియల్స్ నీ, ప్రత్యేక శీర్షికలనూ ప్రచురించి నన్ను ఎంతో ప్రోత్సహించాయి. నేటి ప్రఖ్యాత మెజీషియన్ బి.బి. పట్టాభిరామ్ హైస్కూల్లో నాకు మంచి స్నేహితుడు. ప్రతినెలా ఎవరి పేరు ఎక్కువసార్లు అచ్చవుతుందో చూడాలనే పోటీలో మేమిద్దరమూ పుఃఖానుపుంఖంగా పత్రికలకు రచనలు పంపేవాళ్ళం. ఇవన్నీ హైస్కూలు రోజుల్లో ముచ్చట్లు!

అప్పుడే ‘మూడు యాభైలు’(శ్రీశ్రీ), కూనలమ్మ పదాలు(ఆరుద్ర) చదివాను. వాటిలోని ఒడుపూ, చమత్కారమూ నన్ను గట్టిగా పట్టుకున్నాయి. ఆ ఊపులోనే 1967 ఆంధ్రజ్యోతి వారపత్రికలో మొదలుపెట్టి, తరువాత జోకర్ మాసపత్రికలో ఓ సంవత్సరంపాటు ‘కూనలమ్మ పదాలు’ చందస్సులో ‘కోకిలమ్మ పదాలు’ రాశాను. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలు నాలోని కవిని భుజంతట్టి లేపాయి. అప్పటి వరకూ హాస్యపత్రికల ఆస్థానరచయితగా చలామణీ అవుతున్న నేను ఒక్కసారిగా సీరియస్ కవిగా అవతారమెత్తాను. ఆంధ్రప్రభ వీక్లీ 16-08-1967 జన్మదిన ప్రత్యేక సంచికలో నా మొదటి గేయం అచ్చువేసి పారితోషికంగా పదిరూపాయలు పంపారు. తరువాత రోజులలో సినిమాలకు పాటలు రాసి సంపాదించిన వేల రూపాయల కంటే ఆనాటి పదిరూపాయల మనియార్డరే నా సాహిత్యజీవితంలో తీపిగుర్తుగా నిలిచిపోయింది!

జీవితంలో విద్యార్ధి సమాఖ్య, యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి, - ఈ నాలుగు ప్రజారంగాల తోనూ క్రియాశీలంగా ఏర్పడిన అనుబంధం నాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. ఊహ తెలిసినప్పటినుంచీ ఎర్రజెండా నా ఊపిరిలో భాగమైపోయింది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది. ప్రస్తుతం వోట్లకోసం, సీట్లకోసం భూర్జువా పార్టీలను భుజాలమీద మోస్తున్న ఎర్రజెండాల ప్రయాణం ఎటో తెలియడంలేదు. ఎన్నెన్నో దారులలో చీలిపోయిన ఎర్రజెండాలు ఐక్యం కావాలనే నాలాంటి సామాన్యుడి ఆకాంక్ష నెరవేరే అవకాశం కనిపించడం లేదు.

తెలిసీతెలియని దశలో ఉదృతంగా వరదలా సాగిపోయిన నా రచనా వ్యాసంగం, నాకు తెలిసింది చాల తక్కువ అని తెలుసుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా నడుస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తోంది!



అనుపల్లవి

‘అడవి’ - అదృష్టదీపక్ కవిత్వం....ఇక్కడ చూడవచ్చు :-
http://adavi-kavitalu.blogspot.com

అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ...పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు...ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ - భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే - నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి! -తనికెళ్ళ భరణి, హైదరాబాదు
...............

ఇంతమంది శత్రువుల్ని సంపాదించుకున్న అదృష్టదీపక్ ను ఇలాగే ఉండమని అభినందిస్తున్నాను.
-బ్నిం, సికిందరాబాదు

................

అవధానాలమీద మీ వ్యాసం చూశాను. చాలా బావుంది. ఒక నెలరోజులుగా అలాంటి వ్యాసం రాయాలని అనుకుంటూనే కాలహరణం చేశాను. మీరు వ్రాశారు. నాకంటే బాగా రాశారు. చక్కని వ్యాసం రాసినందుకు నా అభినందనలు అందుకోండి. -వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మదనపల్లె
..............

మీ ‘చాసోజ్ఞాపకాలు’ బావున్నాయి. ఎమ్మే చదువుతున్నరోజుల్లో మీరు శ్రీశ్రీ, రా.రా., గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, మొదలైనవారి గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగా వినేవాణ్ని. ఇప్పటివాళ్ళకు తెలియని మీ అనుభవాలూ, విశేషాలూ వరుసగా రాస్తే బావుంటుంది. మీశైలికూడా ఎదుటివారితో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉంటుంది. అది అందరికీ సాధ్యంకాదు. -కొప్పర్తి, తణుకు

.............

అదృష్టదీపక్ మంచి కవిమాత్రమే కాదు. నిజాయితీగల విమర్శకుడు కూడా అని అర్ధమవుతోంది.నిబద్ధత ముసుగులో ఉన్న కవులూ, రచయితలూ చాలామంది ఉన్నారు. కాని అదృష్టదీపక్ లోపలా, బయటా కూడా నూటికి నూరుపాళ్ళూ నిబద్ధుడైన రచయిత!
-ద్వా.నా.శాస్త్రి,హైదరాబాదు

............

మీసమీక్షలు ఎంతో బాధ్యతగా వుంటాయి. ావి సమాజంపట్లా, సాహిత్యంపట్లా మీకుగల నిబద్ధతను తెలియచేస్తాయి. అందుకే నాకు చాల యిష్టం.
-నిర్మలానంద, ప్రజాసాహితి, హ్య్దరాబాదు

...............................

‘కొనగోటిమీద జీవితం’ అనే ఇటీవలి నా కవితా సంపుటిని రెండుపుటల్లో సర్వాంగీణంగా సమీక్షించాడు అదృష్టదీపక్. ప్రచురించిన మీకు నా కృతజ్ఞతలు!
-డా. సి.నారాయణరెడ్డి, హైదరాబాదు

.....................

అదృష్టదీపక్ రాసిన శ్రీశ్రీ జ్ఞాపకాలు అభిమానుల్ని ఉద్వేగానికి గురిచేశాయి.
-జి. సుబ్బారావు, కొత్తపేట
..................

గురజాడమీద దాడిచేసినవారిమీద అదృష్టదీపక్ చేసిన విమర్శ అర్ధవంతంగా, నిశితంగా, శాస్త్రీయంగాంది.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, అనంతపురం

.........................


బి.వి.యస్. శాస్త్రి నాకు అదృష్టదీపక్ వల్ల పరిచయం అయ్యాడు. ఓ గంట అతనితో మాటాడిన తర్వాత గ్రహించాను అతనొక బంధించబడ్డ కల్లోలసముద్రమని. తెలుగు సాహిత్య వీధుల్లో వికసించి గుబాళించాల్సి వున్న సమయాన అర్ధాంతరంగా తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుని మనమధ్యనుంచి నిష్క్రమించాడు. వెళ్ళిపోయిన ప్రతిభావంతుడైన మిత్రుడికి ఈ నెల ‘దీపకరాగం’ విశిష్టనివాళి.
-స్మైల్, రాజమండ్రి

..........................

దీపకరాగంలోని వస్తువైవిధ్యం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. సమాజంలోని అన్ని రంగాలలోనూ దిగజారిపోతున్న విలువలమీద అదృష్టదీపక్ దండయాత్ర చేస్తున్నాడు. భాష,సాహిత్యం,సినిమా, రాజకీయం- ఇలా విషయం గురించి ప్రస్తావించినా,నిర్మొహ మాటంగాముసుగులు తొలగించి కొరడాదెబ్బలు కొడుతున్నాడు.

-వి.వి. సుబ్బరాజు (రతన్ బాబు), కోలంక
.....................

మీలాంటి వాళ్ళు ఎక్కువగా రాయకపోవడం వలన అభ్యుదయ సాహిత్యానికి ఎంతో అన్యాయం జరుగుతోంది.
-కె.మధుసూదన్, ఆకాశవాణి, విశాఖపట్నం

..........................

అదృష్టదీపక్ ఫొటోలో చక్కగా నవ్వుతూ..ఈ పిల్లాడికి పెళ్ళయిందా? అనుకొనేంత బావుంటాడు. కాని రచనలు చూస్తే, అట్లకాడ గేస్ పొయ్యిమీద బాగా కాల్చి, చొక్కా విప్పించి వాతలు పెట్టినట్టు రాస్తాడు. ఆ వేడికి పేజీలు కాలిపోతున్నాయి.!
-మొహమ్మద్ ఖాదర్ ఖాన్, రాజమండ్రి

.......................

అభ్యుదయ దీపక్ / కధనం జలపాత వేగం / కవనం అభ్యుదయయాగం
ఆశయాల పందిరిలో / అదృష్టదీపక్ రాగం.

-అశోక్ కుమార్,విజయవాడ

దీపకరాగం’ -అదృష్టదీపక్ వ్యాస సంపుటిని ...ఇక్కడ చూడవచ్చు:
http://deepakaraagam.blogspot.కం
...........................
పుస్తక సమీక్ష
అదృష్ట దీపక్ విశ్వరూపం
‘దీపకరాగం’

సమీక్షకులు
: డాక్టర్ చందు సుబ్బారావు
సుప్రసిద్ధ అభ్యుదయ కవీ, సినిమా పాటల రచయితా అయిన అడృష్టదీపక్ సాహిత్యాభిమానులందరికీ సుపరిచితుడు. నటుడూ, గాయకుడూ, సంభాషణా చతురుడూ కావటం చేత ఒకసారి పరిచయమైతే మరిచిపోవటం సాధ్యం కాదు. అరసంలోనూ, ప్రజానాట్యమండలిలోనూ, వాటి అధినాయకసంస్థ అయిన భారత కమ్యూనిష్టు పార్టీ లోనూ1970నుంచీ క్రియాశీల పాత్ర పోషించిన దీపక్ నిబద్ధ వామపక్షవాదిగా రూపొందాడు. ప్రపంచంలో సామ్యవాద ఉద్యమంపరిఢవిల్లి ప్రజలు సుఖశాంతులతో విరాజిల్లాలని కలలుగన్నాడు. ఆ కలలే ఆతన్ని కవిగానూ, కళాకారునిగానూరూపొందించాయి. ఆ కలల వైఫల్యంతోపాటు అనేక రంగాలలో పతనమవుతున్న సామాజిక విలువలు ఆతనిలోతీవ్రమైన ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. ఆతనిలో పెల్లుబికిన ఈధర్మాగ్రహం ‘చినుకు’ మాసపత్రికలో మూడేళ్ళపాటుదీపకరాగం’ ఆలపించింది. నిజాయితీలోపించి చీకటిలో తడుముకుంటున్న విమర్శనారంగంలో కొత్తదీపాలువెలిగించింది. ఇప్పుడు చినుకు ప్రచురణలద్వారా పుస్తక రూపంలో వెలుగు చూసింది.
అదృష్టదీపక్ లోని ఆవేశం కళారూపం తీసుకోవటం ఎంతయినా సంతొషించవలసిన విషయం. నచ్చని మనుషుల్నీ, వాళ్ళ ప్రవర్తనల్నీ, మెచ్చని రాజకీయ తాత్విక ధోరణుల్నీ, వాటి పర్యవసానాల్నీ అతను ఖండించేటప్పుడు వినటం గొప్పసరదాగా ఉంటుంది. పెనవేసిన అభినయం చూడటం కనులకింపుగా వుంటుంది. కానీ, అంతటితోనే ఆగితే అవిఅసంఖ్యాక పాఠకలోకానికి అందకుండాపోయేవి. నిబద్ధుడైన రచయిత వ్యాసం రాస్తే బోనెక్కి సాక్ష్యం చెప్పినట్టే వుంటుంది. వాదానికి వకల్తా పుచ్చుకున్నట్లే వుంటుంది. అచ్చమైన సాహితీ వ్యక్తిత్వానికి సుస్పష్టప్రకటన వెలువరించినట్లేవుంటుంది. వ్యాసరచనలో కవిత్వంలో లాగ దాక్కోటానికి వీల్లేదు. దీపక్ ది అసలే పుల్లవిరిచి పొయ్యిలోకి త్రోసేమనస్తత్వం. తన వ్యాస వ్యక్తీకరణల్లో కుండలు పగులగొట్టి పెంకుల్లో ప్రసాదాలు అందించాడు. దీపకరాగం సంపుటంచదివిన పాఠకుని హృదయంలోనిప్పురవ్వలు రాజుకుంటాయి. గుండెలు మండించి పదికాలాలపాటు ఆరోగ్యవంతమైనఅభినవేశానికి తలుపులు తెరుస్తాయి.
‘ఆధునిక సాహిత్యంలో పెరిగిపోతున్న పెడధోరణులనూ, వెకిలిరాతలనూ చూస్తున్నప్పుడు రా.రా అనే రెండక్షరాలుకళ్ళముందు మెరుస్తాయి’ అంటూ రా.రా స్ఫూర్తికి నివాళులర్పిస్తూ ఈ సంపుటంలోని వ్యాసాలు ప్రారంభమవుతాయి. వామపక్ష, అభ్యుదయ కవులూ, రచయితలూ, కళాకారులూ తరచుగా కనిపించే యీ వ్యాసాల్లో దీపక్స్వీయానుభవాలను కలపటం వలన చక్కటి ‘రీడబిలిటీ’వచ్చింది. మహాకవి శ్రీశ్రీ తోగడిపిన క్షణాలూ, కలిసి పనిచేసినస్మృతి వీచికలూ వివరించిన వ్యాసం ‘చదువ’ ముచ్చటగా వుంది. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే చా.సో ను నవ్వించినవైనం సరదాగా వుంది. ప్రసిద్ధ బుర్రకధకుడు నాజర్ జ్ఞాపకాలనూ, బీవియస్ అనే కవిమిత్రుడి జ్ఞాపకాలనూనెమరువేయటంలో దీపక్ ప్రదర్శించిన శైలి పాఠకుల హృదయాలమీద బలమైన ముద్రవేస్తుంది. ఈపుస్తకం మొత్తంమీదకనిపించే విశిష్ట గుణాలలో ‘విమర్శనాత్మక పరిశీలన’, ‘అద్భుతమైన వస్తు వైవిధ్యం’ పాఠకులను ఎంతగానోఆకట్టుకుంటాయి.
ప్రజారంగాలలో దీపక్ కు పరిచయమైన అట్టడుగు ప్రజల జీవితానుభవం అతనికి అనేకసార్లు రచనల్లో సహకరించింది. పరిశీలనా తత్వంతో నిండిన వ్యాసకర్తగా పరిణమించటానికి యీ జీవితానుభవమే తోడ్పడింది. నిసర్గ సుందరమైనబ్రతుకుల రూపురేఖల్ని పట్టుకోవటంలో అతను చూపిన నేర్పు ప్రశంసనీయంగా వుంది. ‘నిత్య జీవితంలోకవిత్వం’అంటూసామెతల్నీ, నుడికారాల్నీ విశ్లేషించటం లోనూ, ‘చిందుల ఎల్లమ్మ కధ’ను సమీక్షించటంలోనూయీనేర్పు స్పష్టంగా కనిపిస్తుంది. తనలోని సహజ పరిశీలనాశక్తీ, ప్రగతిపధగమనంపై ఆసక్తీ అనేక విషయాలమీదతీవ్రమైన అభిశంసనకు, రచయితను పురిగొల్పాయి. అల్పిష్టి కవిత్వాలూ, అవధానాలూ, పత్రికాభాషలో పొల్లుమాటలూ, కళా వ్యాపారాలూ వంటి విషయాలమీద రచయిత అభిశంసన కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుపుదాడి చేస్తుంది. గాంధేయ వాదులు, కళామతల్లి, అశ్రుతాంజలి వంటి అర్ధంలేని పదప్రయోగాలపై నిశితమైన పరిశోధనా పద్ధతిలో దీపక్చేపట్టిన చర్చ అతనిలోని భాషావేత్తను మనకు పరిచయం చేస్తుంది.
పరస్పర సహకార పద్ధతిలో సాహిత్య, కళారంగాలలో భజనసంఘాలు చెలరేగిపోతున్న తరుణంలో స్వపర భేదంలేకుండాఅనేక అంశాలమీద దీపక్ కొరడా ఝలిపించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమారంగంలో పాతికేళ్ళకు పైబడినఅనుబంధం వుండికూడా ‘చెవిలోపువ్వు అనే వజ్రోత్సవాల కధ’ వ్యాసంలో చిత్రసీమలోని అవకతవకలను నిర్దాక్షిణ్యంగాఎండగట్టాడు. సినిమా పాటలరచనల్లో తొంగిచూస్తున్న అవాంచనీయ ధోరణులూ, అవలక్షణాలూ వివరిస్తూ దీపక్ రాసినచిత్రహింసలు’ వ్యాసం కుహనా సినీ మేధావుల అజ్ఞానాన్ని బట్టబయలు చేస్తుంది. సినిమాల్లో వెకిలి హాస్యమూ, వెకిలిపాటలూ ఎంతహీనమైనవో చూపిస్తూ, మంచిపాటలు ఎలా పుట్టగలవో కూడా రచయిత సాధికారంగా నిరూపించాడు. ప్రతిదానినీ విమర్శించటమే తన ధ్యేయం అనుకోకుండా ‘మాయాబజార్’లాంటి కళాఖండంలోని విశిష్టతను నూతనకోణాలలో విశ్లేషిస్తూ ప్రశంసించాడు. అశోక్ కుమార్ ‘వ్యూహం’ సమీక్షించడంలోనూ, అప్పల్నాయుడు కధల్నిఆవిష్కరించటంలోనూ వ్యాసకర్తలోని సృజనాత్మకత ప్రతివాక్యంలోనూ ప్రతిఫలిస్తుంది.
‘పునర్మూల్యాంకనాలు’పేరుతో చరిత్రనూ, వైతాళికులనూ, సాహిత్య వేత్తలనూ భ్రష్టుపట్టిస్తూ వెలువడుతున్న ఓకొత్తధోరణిని దీపక్ తీవ్రంగా నిరసించాడు. పెడదారి పడుతున్న అత్యంత ప్రమాదకరమైన యీ వైఖరిని కొందరుమేధావులు అతినూతన కులు, మత, లింగ, ప్రాంతీయవాద చేతనగా అభిప్రాయపడుతున్నారు. ఉరుము ఉరిమిమంగళంపై పడ్డట్టు వీరి చైతన్యధాటికి మరణించిన మహానుభావుల కీర్తి ప్రతిష్టలు అన్యాయంగా బలైపోతున్నాయి. దీనినిరచయిత ఖండించటం సబబైన చర్యే. ఈ సంపుటానికి మకుటంగా నిలిచే మరో ముఖ్యమైన అంశం - అజ్ఞాన తిరస్కారం. ‘నేటి నిజం చూడలేని కీటక సన్యాసుల’ పట్ల దీపక్ రాజీలేని శత్రుత్వాన్నిప్రదర్శించాడు.
గురజాడనూ, గిడుగునూ, కందుకూరినీ, శ్రీశ్రీని నిష్కారణంగా నిందించే దివాంధాల గుండెల్లో డైనమైట్లు పేల్చాడు. ఆవ్యాసాల్లో దీపక్ లోని వ్యంగవైభవం పరాకాష్టనందుకుంది. సామాజిక ప్రయోజనాన్ని విస్మరించి బూతునుకళారూపంగా మభ్యపెడుతున్న ఎమ్. ఎ.ఫ్ హుస్సేన్ లాంటి ప్రముఖ చిత్రకారుడిలోని బుద్ధివైపరీత్యాన్ని ‘పిచ్చిగీతలు’ వ్యాసంలో చీల్చిచెండాడాడు. అలాగే శిల్పాశెట్టి - రిచర్డ్ గెరెల బహిరంగ శృంగార సన్నివేశాల్ని ఖండిస్తూ విపులచర్చచేయటం బహుధాప్రశంసనీయం. మేధావులుగా పోజుకొడుతూ, వేదికలమీద చప్పట్లకోసం ఆత్మలుఅమ్ముకుంటున్న కుహనా లౌకికవాదులూ, విచ్చలవిడి స్వేచ్చాజీవులూ యీ వ్యాసాలలో ప్రదర్శితమైన నిజాయితీనిచూసి సిగ్గుతో తలవంచుకోవాలి.
రకరకాల ప్రలోభాలతో సాహిత్యరంగాన్ని నాశనం చేస్తున్నముందుమాటలూ, గ్రంధ సమీక్షలూ యువతరాన్ని పక్కదారిపట్టిస్తున్నాయి. ఎవరికీ కనిపించని దేవతా వస్త్రాల అందచందాల గురించి సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటికలుషిత వాతావరణంలో అదృష్ట దీపక్ తన దీపక రాగాలాపనతో సహృదయులైన చదువరులైన హృదయాలనుహృద్యంగా వెలిగించాడు. ఈ పుస్తకం చదివినవారు ఓమంఛి పని చేసినట్లు ఫీలవుతారని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటేనిరంతరం అధ్యయనశీలి అయిన అదృష్ట దీపక్ వ్యాసాలు పడికట్టు రాళ్ళతో కూడిన ఎకడమిక్ ప్రపంచం నుండి గాక, స్వచ్చమైన బ్రతుకు నల్లరేగడి భూమినుండి ప్రభవించాయి. అభ్యుదయ రచయితకు ప్రాణప్రదమైన ‘విమర్శనాత్మకవాస్తవికత’యీ పుస్తకంలో విశ్వరూపం ప్రదర్శించింది! పతనమవుతున్న విలువలమీద రచయిత ధిక్కారస్వరంభాస్వరమై ప్రజ్వలించింది!!
‘ ‘

.................................................................................................


..................................................................

మాతృమూర్తి సూరమ్మ,తొమ్మిదేళ్ళ దీపక్
అల్లు రామలింగయ్య నుంచి దీపక్ ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు స్వీకారం

గజ్జెల మల్లారెడ్డితో దీపక్

డాక్టర్ సి. నారాయణ రెడ్డి తో..

పాలపర్రులో దీపక్ ని సన్మానిస్తున్న శాంతారాం(సి.పి.ఎమ్),
డా.కందిమళ్ళ సాంబశివరావు

వల్లం నరసింహారావు తొ...

పాలపర్రులో ఆడిటోరియం ప్రారంభోత్సవం


కుటుంబ సభ్యులతో..

పంతం సీతారామమూర్తి, అమరేంద్రలతో..

కుటుంబ సభ్యులతో..

కుమారుడు చక్రవర్తితో..


అడవి ఆవిష్కరణ..

తనికెళ్ళ భరణి,శివాజీరాజాలతో..

కుటుంబ సభ్యులతో..

అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డి,
రాష్ట్రమంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా
ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం
...


తనికెళ్ళ భరణి సారధ్యంలో రావులపాలెం సి.ఆర్.సి లో సన్మానం..

సహోద్యోగులతో..



విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ సత్కారం..

ప్రముఖ వ్యాపారవేత్త చిన్నం సుబ్బిరెడ్డి, మంత్రి గొల్లపల్లి,
నటుడు కొండవలసలతో..


జిత్ మోహన్ మిత్రా నుంచి కళాప్రియ అవార్డు స్వీకారం..

బ్నిం తో..

వంగా గీత,బుర్రా పద్మనాభంలతో..



దేశంలో దొంగలు పడ్డారు లో సుత్తి వీరభద్రరావుతో.. హాస్య నటుడుగా దీపక్..

టి. కృష్ణ, చక్రవర్తులతో..

దర్శకులు పి. చంద్రశేఖర రెడ్డి, టి.కృష్ణ,గుత్తా రామినీడు,
రచయిత మోదుకూరి జాన్సన్, నిర్మాత పోకూరి బాబూరావు ప్రభృతులతో..

జాలాది, నర్రా, దీపక్, ముత్యాల సుబ్బయ్య, రాజేంద్ర ప్రసాద్,
చక్రవర్తి, పోకూరి బాబూరావు, హరనాధరావు,..

దీపక్, బాబూరావు,నర్రా, వెంకట్,హరనాధరావు,
విజయశాంతి, ముత్యాల సుబ్బయ్య..

దర్శకుడు టి.కృష్ణ ప్రభృతులతో..
కృష్ణంరాజు, బాబూరావులతో..

యస్వీ కృష్ణారెడ్డితో..

కె.వి.యస్. వర్మ, కాళీపట్నం రామారావులతో..





సీనియర్ నటీమణి పువ్వుల లక్ష్మీకాంతమ్మను సన్మానిస్తూ...

కాకరాల దంపతులను సన్మానిస్తున్న దీపక్ దంపతులు



రచయిత డాక్టర్ కేశవ రెడ్డికి ఆర్టోస్ పురస్కారం సందర్భంగా..
పారిశ్రామిక వేత్తలు అడ్డూరి పద్మనాభరాజు, వర్మలతో..

గరికిపాటి నరసింహారావు, గిడుగు రాజేశ్వరరావులతో..

భమిడిపాటి రాధాకృష్ణకు సన్మానిస్తూ...సత్తి వెంకటరెడ్డి,
దీపక్, పడాల సుబ్బారెడ్డి, కొవ్వూరి త్రినాధరెడ్డి,
అప్పలాచార్యర్ తదితరులు..


చలపతి,శివారెడ్డి, వర్మలతో..

దీపక్ - స్మైల్

స్మైల్,బేతవోలు రామబ్రహ్మం, యర్రాప్రగడ రామకృష్ణ,
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి లతో.
.

బి.వి.పట్టాభిరామ్ తో..

డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి, అద్దేపల్లి లతో..

ఎన్. గోపి, అద్దేపల్లిలతో..

తనికెళ్ళ భరణి తో..



అద్దేపల్లి. పడాల రామారావు లతో..

పురుషోత్తం, అశోక్ కుమార్, దీపక్, మాస్టర్ స్వరూప్ రెడ్డి,
శివారెడ్డి, డాక్టర్ స్టాలిన్



సుమన్ తో..


నటుడు నర్రాతో..




















కొత్తపేటలో శ్రీనాథరత్నశిల్పివుడయార్ కళాపురస్కారాన్ని
అదృష్టదీపక్ అందుకున్న సందర్భంగా..
(30-11-2012)
















‘ప్రాణం’ వచన కవితా సంపుటి అంకితం..


నటుడిగా దీపక్

Mayuura kalaparishat, Ramachandrapuram


వికాస్ వార్షికోత్సవాలలోదీపక్ ......










z tvలో..






వంగపండు కుటుంబ సభ్యులతో...





టివి లో..











అదృష్టదీపక్, శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు

అదృష్టదీపక్, శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు

అదృష్టదీపక్, శ్రీ డి.వి.వి.ఎస్. వర్మ, శ్రీ మానం ఆంజనేయులు





దీపక్








ముఖ్య అతిధులు డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ విరియాల లక్ష్మీపతి,
ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయలక్ష్మిగారలతో
శ్రీ అదృష్ట దీపక్, శ్రీమతి స్వరాజ్యం దీపక్, శ్రీమతి కిరణ్మయి తదితరులు


డాక్టర్ చందు సుబ్బారావు గారిని సన్మానించిన శ్రీ అదృష్ట దీపక్,
సాహితీ మిత్రులు శ్రీ జంపన రఘురాం, శ్రీ చింతా తాతారెడ్డి,
శ్రీ చలపతి, శ్రీ కాళ సత్యనారాయణ


శ్రీ విరియాల లక్ష్మీపతి గారిని సన్మానించిన శ్రీ అదృష్ట దీపక్,
సాహితీ మిత్రులు శ్రీ జంపన రఘురాం, శ్రీ చింతా తాతారెడ్డి,
శ్రీ చలపతి, శ్రీ కాళ సత్యనారాయణ






























ప్రత్తిపాడులో జరిగిన శ్రీశ్రీ శత జయంతి సభలో
సింగంపల్లి అశోక్ కుమార్ ప్రచురించిన
శ్రీశ్రీ శతజయంతి బులిటెన్ ను
ఆవిష్కరించిన ముఖ్య అతిధి అదృష్ట దీపక్,
అద్దేపల్లి రామ్మోహనరావు తదితరులు.
7-2-2010 తేది ‘ఆంధ్రజ్యోతి’


...................................................

The Hindu, Saturday, May 07, 2005
Literary meet
The Krishna district unit of the Progressive Writers' Association would conduct a literary meet on "Cultural pollution," at Chandra Rajeswara Rao
Grandhalayam in Prajasakthi Nagar here on Sunday. The association's general secretary, M. Prasad, said progressive writer, Adrushta Deepak, would be the chief guest. A kavi sammelan would also be organised on the occasion, he added.




Saakshi - 8-3-2010





Saakshi - 28-3-2010
‘మానవత్వం పరిమళించే మంచిమనిషికి స్వాగతం’
మంచిపాట - సాక్షి


Saakshi-7/11/2010










saakshi- 15oct.2010


-Yakoob Pasha, Deepak, Raajireddy of Saakshi
..........................................................................................................................

ఆంధ్రజ్యోతి - దినపత్రిక నుండి.......
28.3.2011న 'వివిధ'లో నా పేరుతో ప్రచురించిన 'అమ్మ ఎప్పుడొస్తుంది?' కవితకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు. నన్ను అప్రతిష్ఠ పాలు చెయ్యడానికి ఈ మధ్య కొంతమంది 'లిటరరీ క్రిమినల్స్' ఇలాంటి పనులు చేస్తున్నారు.
ఒకరి అభిప్రాయాలను వేరొకరు తీవ్రంగా ఖండించుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. కాని వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఇలా నీచమైన కుట్రలకు పాల్పడటం శోచనీయం. ఇలాంటి వెకిలి చేష్టలను ఖండిస్తూ, నా నిరసన తెలియజేస్తున్నాను..
.- అదృష్టదీపక్


..............................................................................................................


2 may 2011 Ramachandrapuram





























‘మీరే మీరే మాస్టారు - భక్తి టి.వి లో దీపక్ ఇంటర్వూ..






‘పాడుతా తీయగా’..దీపక్ గురించి...ఎస్.పి.బాలు...


తెలుగు వెలుగు - ఈటివి లో దీపక్ ఇంటర్ వ్యూ