Pages

Monday, August 13, 2012

శ్రీశ్రీ నూరేళ్ళ పండుగ


మహాకవి శ్రీశ్రీ నూరేళ్ళ పండుగ



సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్ ప్రసంగం....
మహాకవి 1910 ఏప్రిల్ 30న జన్మించాడు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం. అందుకే అభిమానులు రాష్ట్రమంతటా వేడుకలు జరుపుకొంటున్నారు. శ్రీశ్రీసాహిత్యంగురించి ఎంతచెప్పినా ఏదో ఒక కోణం మిగిలిపోతుంది.ఆధునిక తెలుగుసాహిత్యంలో రాశిలోనూ, వాసిలోనూకూడా శ్రీశ్రీ అగ్రగణ్యుడే! సీరియస్ కవిత్వం-సినిమా కవిత్వం-కార్టూన్ కవిత్వం-కధలు-నాటికలు-వ్యాసాలు-అనువాదాలు-ఆత్మకధ-ఇలా చెప్పుకుంటూ పోతే అనంత సాగరంలా కనిపిస్తుంది!
ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవభావాలకూ, విప్లవ పరిభాషకూ ఆద్యుడు శ్రీశ్రీ. తొలి రోజులలో తెలుగు కవిత్వం అంతాదేవుళ్ళనూ, వాళ్ళ మహిమలనూ, రాజులు చేసిన యుద్ధాలనూ, దండయాత్రలనూ, వాళ్ళ ఉద్యానవన విహారాలనూవర్ణించడంతోనే సరిపోయింది. ప్రజలనూ, ప్రజాసమస్యలను గాలికొదిలేశారు. అధికార మదోన్మత్తుల ఆనందం కోసం, ధనవంతుల కాలక్షేపం కోసం మాత్రమే కవిత్వం పరిమితమైపోయింది. ఈ ధోరణికి మధ్యలో ఒక్క వేమన్న మాత్రమేఅపవాదుగా నిలిచాడు. ఆనాటి సమాజంలో పెరిగిపోతున్న అవినీతినీ, అజ్ఞానాన్నీ చీల్చి చెండాడాడు. వేమన్న తరువాతమళ్ళీ పాతధోరణే కొనసాగింది. ముద్దుపళని ( రాధికా సాంత్వనం), సముఖము వేంకట కృష్ణప్పనాయకుడుఅహల్యాసంక్రందనం) మొదలైన వాళ్ళు తమ కావ్యాలలో అసభ్య శృంగారాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయి సాహిత్యంలోక్షీణయుగానికి ద్వారాలు తెరిచారు.
ఇలాంటి విపరీత ధోరణులతోకూడిన తెలుగు కవిత్వానికి వెయ్యేళ్ళు నిండుతుండగా- మహానుభావుడు గురజాడఅప్పారావు వేగుచుక్కలా అవతరించాడు. ఆధునిక తెలుగు సాహిత్యానికి నూతన దిశానిర్దేశంకావించాడు. భాషలోనూ, భావంలోనూ, ప్రజాస్వామ్య దృక్పధం అవసరాన్ని నొక్కిచెప్పాడు. ఆ వెలుగుల జెండాను తన ఎజెండాగా స్వీకరించినమహాకవి శ్రీశ్రీ మరింత ముందుకుపోయి కవిత్వంలో విప్లవభావాలను ఆవిష్కరించాడు. కవిత్వం కచ్చితంగా సామాన్యులజీవితాన్నీ, వాళ్ళ బాధల్నీ, గాధల్నీ ప్రతిబింబించాలన్నాడు. వాటికి పరిష్కారాల్ని కూడా చూపించాలని ఉద్ఘాటించాడు. మహాప్రస్థాన గీతాలతో సామాన్యమానవుడి పక్షాన వకాల్తా తీసుకున్నాడు. ‘కష్టజీవికి ఇరువైపులా నిలబడినవాడే కవి’ అని ప్రకటించి, ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేద’ని దిక్కులు పిక్కటిల్లేలా ఎలుగెత్తి చాటాడు. సమస్తరంగాల్లోని కష్టజీవులనూ, కర్మవీరులనూ తన కవిత్వంలో కధానాయకులను చేశాడు. సంప్రదాయపుచందోబందోబస్తులను ఛట్ ఫట్ మని త్రెంచేసి, తెలుగు కవితాకన్యకు స్వేచ్ఛను ప్రకటించాడు.
అలనాడు అల్లసాని పెద్దన కవిత్వం చెప్పాలంటే నిరుపహతి స్థలమూ, రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురపువిడెమూ, ఆత్మకింపయిన భోజనమూ, ఊయల మంచమూ వగైరా సదుపాయాలు కావాలన్నాడు. దానికి భిన్నంగామహాకవి శ్రీశ్రీ
“కదిలేదీ కదిలించేదీ/ మారేదీ మార్పించేదీ
పాడేదీ పాడించేదీ/ మునుముందుకు సాగించేదీ
పెనునిద్దుర వదిలించేదీ/ పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ
కావాలోయ్ నవకనానికి”
అంటూ విప్లవ భావాలనూ, విప్లవ పరిభాషనూ ప్రతిష్ఠించి నూతన యుగకర్తగా నిలిచాడు. “మంటలతో మాట్లాడించాడు. రక్తంతో రాగాలాపన చేయించాడు”. మాటలతో ఆటలాడుకున్నాడు. శబ్దాలతో చాకిరీ చేయించుకున్నాడు.
క్రియాశీల జీవితానికి దూరంగా ఉండేవారిని “ఎముకలు కుళ్ళిన-వయస్సు మళ్ళిన సోమరులారా చావండి!” అనితీవ్రంగా శపించిన శ్రీశ్రీ, రాబోవు యుగంలో పావన నవజీవన బృందావన నిర్మాతలైన యువకులకు మాత్రం తనఆశలనూ, ఆశయాలనూ, ఆవేశాన్నీ అందిస్తూ ఆహ్వానం పలికాడు!!
అవును-శ్రీశ్రీ ! అతని భావాలు నిత్యాగ్నిహోత్రాలు!!

.................................

ముఖ్య అతిధులు డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ విరియాల లక్ష్మీపతి,
ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయలక్ష్మిగారలతో
శ్రీ అదృష్ట దీపక్, శ్రీమతి స్వరాజ్యం దీపక్, శ్రీమతి కిరణ్మయి తదితరులు


డాక్టర్ చందు సుబ్బారావు గారిని సన్మానించిన శ్రీ అదృష్ట దీపక్,
సాహితీ మిత్రులు శ్రీ జంపన రఘురాం, శ్రీ చింతా తాతారెడ్డి,
శ్రీ చలపతి, శ్రీ కాళ సత్యనారాయణ




శ్రీ విరియాల లక్ష్మీపతి గారిని సన్మానించిన శ్రీ అదృష్ట దీపక్,
సాహితీ మిత్రులు శ్రీ జంపన రఘురాం, శ్రీ చింతా తాతారెడ్డి,
శ్రీ చలపతి, శ్రీ కాళ సత్యనారాయణ




ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్,


ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్

ప్రసంగిస్తున్న సభాధ్యక్షులు శ్రీ అదృష్ట దీపక్
ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నాటక రచయిత,
రాష్ట్ర అరసం కార్యదర్శి శ్రీ విరియాల లక్ష్మీపతి
ప్రసంగపాఠం:


మహాకవి గురజాడ నుండి స్వీకరించిన నవ్య కవితాస్ఫూర్తికి ఒక విరాడ్రూపాన్ని సంతరించిపెట్టాడు శ్రీశ్రీ.
ఆ నవ్య కవితా జగతికి నాయకత్వం వహించి, నూతన యుగానికి యుగకర్తగా ప్రకటించుకున్నాడు.
ప్రబంధకవులు భావకవులు పండితులు చాందసవాదులు తెలుగు కవిత్వంలో వీరంగం చేస్తున్న తరుణంలో నేను యుగకర్తని అని ప్రకటించుకోవడానికి ఎంత ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం శ్రీశ్రీకి ఎక్కడ నుండి వచ్చింది, అంటే అప్పటికే తనలోగల ప్రబంధ కవితాశక్తి, గురజాడ నుండే అందుకున్న నవ్య కవితాస్ఫూర్తి, జాతీయ అంతర్జాతీయ అవగాహనా శక్తి, ఈ మూడు అద్వితీయ శక్తులు శ్రీశ్రీలో మూర్తీభవించి వుండటం కారణంగానే శ్రీశ్రీకి అంతటి ధైర్యంఅలవడిందని దానితోపాటే మహాకవిగా నిరూపించడానికి కావలసిన ప్రజ్ఞాపాటవాలు సంక్రమించాయని నిరూపించవచ్చు. యూరప్ ని కదిలించిన అండ్రే బ్రెటాన్ సర్రియలిజంలోనూ సైకో ఆటోమేషన్ లోనూ మునిగి మార్క్సిజంలో ఉదయించిన తనలోని సామాజిక వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకున్నాడు. పరిశోధించే లోకన్నుంటే, శ్రీశ్రీ యుగకర్తగా ప్రతిష్టించడానికి శతాధిక కారణాలు స్పష్టంగా కన్పిస్తాయి.

ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కక్కడై దోచు పోలిక అన్నట్లుగా సమస్తమైన వారికి తాము ఏకోణంలోంచి దర్శించినా శ్రీశ్రీ ఒక మహాకవిగా ఒక ప్రజాకవిగా తానొక్కక్కడై ఒక్కరికే దర్శనమిస్తాడు.
సూర్యుడు కాంతి ఎంత యదార్ధమో, శ్రీశ్రీ అతని కవిత్వమూ అంత యదార్ధమైనవి.
పరిశీలించాలేగాని శ్రీశ్రీ సాహిత్యంలో బహుముఖీన లక్షణాలు గల అనేక పార్శ్వాలున్నాయి. అయితే అందులో ముఖ్యమైనది శ్రీశ్రీ చెప్పినట్లు గానే అభ్యుదయం ప్రధానలక్షణం గల పార్శ్వం.
అభ్యుదయం ఆక్సిజన్ లాంటిది. మానవుడున్నంతకి ఆక్సిజన్ ఎలాంటిదో అభ్యుదయావసరం కూడా అలాంటిదే. ఏదో ఒక దశలో ఏదో ఒక మలుపులో దాని అవసరం తీరిపోయేది కాదు. గతిశీలంగా నడిచే సమాజ పరిణామాన్ని క్రమబద్ధంగా సవరిస్తూ సరిచేస్తూ ఋజుమార్గంలో సమాజాన్ని నడిపిస్తూ పోతుంది అభ్యుదయం.
అంటే మానవుడు ప్రగతి పధంలో నడవాలని అనుకున్నన్నాళ్ళూ శ్రీశ్రీ కవిత్వం తాలూకూ అవసరం ఏర్పడుతుందని, శ్రీశ్రీ కవిత్వం అభ్యుదయానికి ఆక్సిజన్ కి పర్యాయపదం అని వేరే నిర్వచించనవసరంలేదు.
శ్రీశ్రీ మహాకవి అనే మహాసౌధానికి పునాది ఆధారము మహాప్రస్థాన కావ్యమే. శ్రీశ్రీ ఇతర కృతులన్నీ ఆ మహాసౌధాన్ని నిర్మించడానికి అలంకరించడనికి ఉపయోగపడిన పోర్టికోలు, కారిడార్లు, అంతస్థులు, అందాల విడిభాగాలే.
శ్రీశ్రీ మహాప్రస్థాన గేయ రచన 1934లో వెలుగుచూసింది. ఆనాటికి ప్రపంచం నలుదిశల ఒక యుద్ధ వాతావరణం ఒక సంచలనాత్మక సంక్షోభం అలుముకుని ఉంది.

ప్రపంచంలో యుద్ధాల నధిగమించి స్వేచ్ఛావాదం శాంతయుత సహజీవనవాదం ప్రజాస్వామ్యం ప్రతిష్టించాలని ఆరాట పడుతున్న ప్రగతి శక్తుల ప్రభావం దేశంలో సంఘర్షిస్తోంది. ప్రపంచం ఆర్ధిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం నాజీల దాడి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. భారత దేశంలో సాంఘిక, ఆర్ధిక, రాజకీయపరమైన స్వేచ్ఛాసమాజం నిర్మించాలని, బానిసత్వం నిర్మూలించాలని, ఒక మహాలక్ష్యం మనసావాచాకర్మణా ప్రజలందరిలోనూ పరుచుకొనివుంది. భారతీయులు గీత సాక్షిగా మహాత్ముడు గీసిన గీత మీద నడుస్తున్న రోజులవి.

సమాజంలో పేరుకుపోయిన ఆర్ధిక సంక్షోభం, మార్క్స్ ప్రతిపాదించిన ఆర్ధిక సిద్ధాంతం పరిష్కరించగలదన్న నమ్మకం, దేశంలో గల మేధావుల్లో అక్కడక్కడ ప్రబలమైవుంది.

అన్ని దేశాలపైనా రష్యా సామ్యవాద అభయ హస్తాలు చాచడం మొదలైంది. విశ్వమానవుని సామ్యవాదం, దేశాల్లోనూ కవుల్లోనూ, మేధావి వర్గంలోనూ, తాత్వికుల్లోనూ ప్రతిబింబించింది. వారంతా జాతీయ వాదానికి కుడిగానూ, అంతర్జాతీయ వాదానికి ఎడంగానూ జరగడం ప్రారంభం అయింది.


సరిగ్గా అదిగో ఆ తరుణంలోనే యువకవిగా వున్న శ్రీరంగం శ్రీనివాసరావు విశాఖలో టర్నర్ చౌల్ట్రీలోగల చీకటికొట్టులో కూర్చొని, కవిత్వంలో కళ్ళు తెరిచాడు. ప్రపంచ సుందరిపడుతున్న పురిటినొప్పిని తన నొప్పిగా స్వీకరించి కవితా ఓ కవితా అంటూ ఆక్రోశించాడు, ఆవేదన పొందాడు, ఆక్రందన చేశాడు, ఆందోళన చెందాడు, ఆవేశ పడ్డాడు.

కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షస రతిలో
అర్ధ నిమీలత నేత్రాలు
భయంకర బాధల బాటల పల్లవి
ఉరితీయ పడ్డ శిరస్సు చెప్పిన రహస్యం
ఉన్నాది మనస్సినీవాలి
అంటూ సర్రియలిజంలో ఆక్రోశించాడు. కడుపు నొప్పిన కవిత్వంగా మార్చాడు. అలాంచి ఆక్రోశాలకి, ఆవేదనలకి, ఆక్రందనలకి, ఆవేశాలకి, ఆత్మీయులకి, అంతకరణలకి, గొప్పసృజనశక్తితో గేయాల దుస్తులు తొడిగాడు. భజగోవిందం
భజగోవిందం అన్న ధ్వనిని మరో ప్రపంచం మరో ప్రపంచం అని,మానిషాద ప్రతిష్టాం త్వమగమశ్శాశ్వతీసమః అన్న లయని ఎదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని, దేశమంటే మట్టికాదోయ్ అన్న పదాన్ని దారి ప్రక్క చెట్టు క్రింద ఆరని కుంపటి విధాన అంటూ గతంలో గురువులు చెప్పిన ప్రవచనాల్ని ఆగతానికి గురుజాడలుగా అందించాడు. జనం మధ్యకు వదిలాడు. కవుల్ని పండితుల్ని అబ్బుర పరిచాడు. అదిగో అప్పటి నుండి ఆ శక్తులన్నీ కవితా శక్తులుగా మారి ప్రతి మానవ మేధాల్లోనూ తాండవించడం ప్రారంభించాయి. నాకు తెలియదంటూనే మార్క్సుజాన్ని కవిత్వంలోకి, గతి తార్కిక భౌతికవాదాన్ని వచనంలోకి తర్జుమా చేసి తెలుగు సాహిత్యానికి కళ్ళు, కొడవళ్ళు, పిడికిళ్ళూ, వెన్నెముకలు రక్తమాంసాలు అందించాడు. శ్రీశ్రీ వచన కవితకి ప్రాణప్రతిష్ట చేశాడు.

కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి
కోటి చేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి.
అంటూ రష్యా ఆదర్శాన్ని తెలుగింటి పెరటి గుమ్మంలోంచే ఆహ్వానించాడు. భారతదేశపు స్వాతంత్ర్య పోరాటం వీధి గుమ్మంలో ముమ్మరంగా జరుగుతున్న కారణంగా రష్యా సామ్యవాద సూత్రాల్ని పెరటి గుమ్మంలోచే స్వాగతించాడు శ్రీశ్రీ.
అయితే అది నేటికీ పెరటి గుమ్మం ప్రక్కనే వేపచెట్టయి ఆరోగ్య వీచికలు వీస్తోంది. కాని అదేందురదృష్టమో వీధి గుమ్మంలోకి వచ్చి తొంగి చూడలేక పోతోంది. అయితే అది శ్రీశ్రీ తప్పు కాదు.

ప్రపంచ జంట కవులు ప్రపంచంలోగల శ్రమ దోపిడి, పదార్ధ అస్తిత్వ లక్షణాలు వాటి మార్పు, వస్తువుల్లో నిహితమైన వున్న పరస్పర వ్యతిరేక శక్తుల సంఘర్షణ, మొదలయిన వాటిమీద లోతైనపర్శోధన చేసి గతి తార్కిక భౌతికవాదంగా ప్రకటన చేసారు మార్క్స్ ఏంజెల్స్ ప్రభృతులు. పడక కుర్చీ మీంచి దించి తత్వశాస్త్రాన్ని మురికివాడల్లోకి మళ్ళించారు.

అయితే ఈగొడవేదీ నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా పీడితునికి ముందు వెనుకా బాసటగా నిలబడ్డం ఒక్కటే నాకు తెలుసు అంటూ....చిరకాలం జరిగిన మోసం/ బలవంతుల దౌర్జన్యాలు/ ధనవంతుల పన్నాగాలూ/ ఇంకానా ఇకపై సాగవు/ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి/ ఒక జాతిని మరొక జాతి/ పీడించే సాంఘిక ధర్మం/ ఇంకా ఇకపై సాగవు అంటూ మార్క్సిజాన్ని కవిత్వంలోకి అనుసంధించాడు శ్రీశ్రీ.
దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే కార్మిక లోకపుకళ్యానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి తన కవిత్వాన్ని సమర్పిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. పతితుల్ని భ్రష్టుల్ని, బాధా సర్పదష్టుల్ని, దీనుల్ని, హీనుల్ని, అంతవరకూ ఏకావ్యంలోనూ కన్పించని వ్యక్తుల్ని, సమస్యల్ని ఆకలి సంక్షోభాల్ని కవిత్వంలోకి రప్పించి రధంమీద ఎక్కించి పీడితులంతా గొప్పగా బ్రతికే మరో ప్రపంచానికి ఒక పీడితులంతా గొప్పగా బ్రతికే మరో ప్రపంచానికి ఒక హైవే నిర్మించాడు. అందరిచేత తనకావ్యంలోకి మహా ప్రస్థానం చేయించాడు.
పీడితులపట్ల బాధ్యత వహించడం ఒక్కటే తనకీ తన కవిత్వానికి పరమావధి గల సందర్భంగా ప్రవచించాడు. అరసానికి విడాకులిచ్చి విరసంతో కాపురంచేస్తూ మరో నీరసంతో వ్యభిచరించినా శ్రీశ్రీ మార్గం విలక్షణమైంది. అనితర సాధ్యమైంది.

మహాప్రస్థానం ఏదో ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితం అయిన కావ్యంకాదు. ఇందులో ఒక గొప్ప అంతర్జాతీయతా భావం విశ్వమానవతా వేదం నేను సైతం అంటూ వేల గొంతుకుల భ్వన ఘోష ఒక్క గొంతులోనే నిక్షిప్తమయ్యేలా ప్రతిఫలించాడు శ్రీశ్రీ. అదే అందరికోసం ఒక్కడు, ఒక్కని కోసం అందరూ అన్న సూక్తికి మాతృకైంది.

ప్రపంచంలో ఏ మారుమూల పతితులు, భ్రష్టులు, దీనులు, హీనులు, పీడితులు, దాడితులు, ఘార్ణిల్లుతున్నా శ్రీశ్రీ కవిత అన్వయిస్తుంది. అదే శ్రీశ్రీ గొప్పతనం, అదే శ్రీశ్రీ రచనలోని విశ్వమానవతావాదం. అదే శ్రీశ్రీ మహాకవి అని ప్రకటించడానికి ఱుజువు చేయడానికి గల గొప్ప ఆధారం. అదే శ్రీశ్రీ క్రాంతదర్శి అని నిర్వచించడానికి గల అక్షరసాక్ష్యం. ఇన్ని మహత్తర కారణాలు ఉండాబట్టే ౧౯౫౨లో మొట్టమొదటిసారిగా శ్రీ చండ్ర రాజేశ్వరరావు గారు, రవీంద్రుడు గాంధీని మహాత్మా అని బిరుదు ఇచ్చి సత్కరించినట్లుగా శ్రీశ్రీని మహాకవిగా ప్రశంసించి విశాలాంధ్రలో వ్యాసం రచించారు. అది నాటికి నేటికీ ప్రజల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుంది.

అయితే ఇటీవల శ్రీశ్రీయుగం అంతరించిందని, అభ్యుదయానికి కాలం చెల్లిందని, మార్క్సిజం ఇకపై అన్వయించిందనికొన్ని అరాచక శక్తులు పని గట్టుకొని ప్రచారం చేస్తున్నాయి.
శ్రీశ్రీని ఈ యుగం నుండి తప్పించి, ఆ స్థానంలో మరొక అల్పశ్రీని ప్రతిష్టించాలని, సాహిత్యంలో గల కొన్ని దుష్టశక్తులు, చాందసులు, ఈర్ష్యాళువులు ప్రయత్నించారు. నేటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ రకం దాడి గురజాడ పైనాజరిగింది. గురజాడని గురుజాడగా స్వీకరించిన శ్రీశ్రీ మీద కూడా అదేవిధంగా జరగడంలో ఆశ్చర్యపోనవసరంలేదు.
అయితే ఇది జ్వాలని చేత్తో ఆర్పడం లాంటిది. కురిసే జలస్తంభాల్ని గొడుగు పట్టడం లాంటిది.
మహాకవులిద్దరి మీద ఇలాంటి ప్రయత్నాలు సాహిత్యంలో లబ్ద ప్రతిష్టులైన వారే ప్రయత్నించి భంగపాటు చెందారు. శెట్టిఈశ్వరరావు, అవసరాల సూర్యారావు, పురిపండా, కె.వి.రమణారెడ్డి, సోమసుందర్ లాంటి వారు వారి నోళ్ళు శాశ్వతంగామూయించారు. ఇప్పుడు మళ్ళీ కొందరు తోకలు జాడిస్తున్నారు. కాకి చూపు రాయిళ్ళు కాకిగోల చేస్తున్నారు.గన్నునితిరగేసి పేలుస్తున్నారు.
శ్రీశ్రీ మీద విసిరిన కువిమర్శనా కంకర్రాళ్ళన్నీ అక్షింతలుగా మారిపోవడం, తిట్ల బండరాళ్ళు పూలదండలుగాఅమరిపోవడం, అవమానాలు సన్మానాలుగా అయిపోవడం సాహిత్య చరిత్ర చెపుతున్న సత్యమే. కుదించినకొద్దీవిస్తరించడం, విమర్శిస్తే విశ్వరూపం ధరించడం శ్రీశ్రీలోనూ, శ్రీశ్రీరచనా శక్తిలోనూ వుందన్న సత్యం విశ్వనాధ లాంటి లబ్దప్రతిష్టులకు మాత్రమే తెలుసుకాని, ఈ అల్పులకు మాత్రం తెలీదు. శ్రీశ్రీ రాసిన ప్రతి అక్షరాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతికవితని జాతీయ, అంతర్జాతీయ ప్రాసంగికతలో నేటి సమాజానికి అన్వయిస్తూ తులనాత్మక పరిశీల చేయడం నేటియువతరం బాధ్యతగా స్వీకరించాలి. శ్రీశ్రీ మనవాడు. మన విశాఖపట్నం వాడు.
విశాఖని ప్రబంధంగా ఈక్షించినవాడు. మనకి కన్పిస్తూ తిరిగినవాడు. విశాఖ సముద్రం ప్రక్కనే వుండి సప్త సముద్రాలుశోధించినవాడు. ఖండాంతరఖ్యాతినార్జించినవాడు. తీర్ధపు రాళ్ళ దగ్గర కవితా తీర్ధం పుచ్చుకున్నవాడు.
నేటికీ అతను తిరిగిన ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇక్కడి గాలుల్లో మిళితమై వున్నాయి. అతడు ఏదో ఒక కులానికో, ఏదో ఒక వర్గానికో చెందినవాడు కాదు. విశ్వమానవుడు. గోపుర శిఖరాక్షరాలు గలవిశ్వంభరుడు శ్రీశ్రీ. ఒక శిఖరాక్షరం యారాడ కొండయితే రెండో శిఖరాక్షరం కైలాసగిరి. వెరసి విశాఖ, అతడే శ్రీశ్రీ....
మనసున మనసై
బ్రతుకే సమతై
మార్క్సిజం కవిత్వమై
కవిత్వం పీడితునకు తోడై
నిజం కమ్యూనిజమైతే
ఎంత భాగ్యం, అదెంతటి స్వర్గం,
అంటూ మానవత్వం మీద అపారమైన గౌరవము, నమ్మకము గల ప్రజా కవి శ్రీశ్రీ.
పీడితుల గుండెల్లోనిరంతరం మేల్కొని వుంటాడు శ్రీశ్రీ.
కాలానికి కొలమానం శ్రీశ్రీ.
శతమానం భవతి శ్రీశ్రీ.
శతాయుహు పురుషేంద్రుడు శ్రీశ్రీ.

..........................


ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి శ్రీ విరియాల లక్ష్మీపతి

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి శ్రీ విరియాల లక్ష్మీపతి

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి శ్రీ విరియాల లక్ష్మీపతి

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి శ్రీ విరియాల లక్ష్మీపతి

డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ అదృష్ట దీపక్

డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ అదృష్ట దీపక్

డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ అదృష్ట దీపక్

శ్రీశ్రీ కవిత్వాన్ని వినిపిస్తున్న చిన్నారి హరిత జంపన

శ్రీశ్రీ కవిత్వాన్ని వినిపిస్తున్న శ్రీదాట్ల దేవదానం రాజు

శ్రీశ్రీ కవిత్వాన్ని వినిపిస్తున్న శ్రీ పి.ఆర్.ఎల్. స్వామి

డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ అదృష్ట దీపక్,శ్రీ విరియాల లక్ష్మీపతి
ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, విమర్శకులు డాక్టర్ చందు సుబ్బారావు ప్రసంగం..

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఒక్కడే శ్రీరంగం శ్రీనివాసరావు.అటు మార్గ, దేశి రూపాల్లోగాని యిటు ఆధునికకవుల్లోగాని అతని రూపం విశిష్టం. అతనికతనే సాటి. అనర్గళం, అనితరసాధ్యం అతని మార్గం. అందరికంటే గొప్పవాడనీ, ఆయనొక్కడే కవిఅనీ అనటం లేదు. ఆధునిక యుగానికి నాయకుడు. అభ్యుదయ యుగానికి పితామహుడు. మొత్తంఆంధ్రసాహిత్యంలో అపురూపమైనకవి. ‘నాదొక వర్గం, నేనొక దుర్గం,’ అని చెప్పగల్గినకవి. సామ్యవాది. రష్యన్సామ్యవాదాన్ని ప్రేమించినవాడు. అటువంటి సమాజం భారతదేశంలో రావాలని ఆశించినవాడు. అంతర్జాతీయవాది.. “నేడు నేషనల్, అంటే ఇర్రేషనల్, పైగా సెన్సేషనల్, ఏతత్సంబంధ ఘోషణల్....నిరర్ధక దుర్భాషణల్” అని ఆయన ౧౯౮౦ ప్రాంతాల్లో రాసినప్పుడు, యీయనకు దేశభక్తి లేదనీ, రష్యా, చైనాలకు తొత్తనీ నిందించారు. ఈవేళ ఏది నిజమైంది? ఎవరిది నిజమైంది?? గ్లోబల్ కుగ్రామనీ, ప్రపంచీకరణ అనీ, జాతుల సరిహద్దులు చెరిగిపోతున్నాయనీ అనటం శ్రీశ్రీకి ఘననివాళి కదూ..... సామ్యవాద ప్రజాస్వామ్యం ఆయనకు కితాబులీయటం లేదూ.... చందస్సుల పరిష్వంగాలూ, వ్యాకరణాల సంకెళ్ళూ తెగి ఆవలపడలేదూ.....

ఈవేళ పద్యంలో రాస్తున్నదెవరు? తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నించనిదెవరు?? ప్రపంచకార్మికులంతా కలసి కట్టుగా ఆలోచించటం ఆయనకు కితాబుకాదూ??? పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయివిజయగీతికా అని స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాడుకొనటం శ్రీశ్రీకి కితాబుకాదూ???? అవినీతీ, బంధుప్రీతి, చీకటిబజారుఅలముకున్ననీ దేశం ఎటు దిగజారు? అని దేశభక్తులు వివేచించటం శ్రీశ్రీ కవితకు కితాబు కాదూ....

ఋతువర్ణనలూ, ఆశ్వాసాంతగద్యాలూ, అష్టాదశ అలంకారాలూ, రసపట్టు శృంగారాలూ, కనికట్టు
(ద్విజాగ్రద్బాంధవ భంజనాదృష్టభ్రష్టాధీశపృధ్వీశ్వరా) ఎక్కడైనా కన్పిస్తున్నాయా..??

కొడవలి, రంపం, గొడ్డలి, నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నాలూ పాలక మడళ్ళకు గుర్తులు కాలేదూ... చెమటబిందువులకు గౌరవం పెరగటం, సామాన్య ప్రజలకు సార్వభౌమాధిపత్యం కట్టపెట్టటం శ్రీ శ్రీ సాహిత్య ప్రస్థానానికి కలికితురాయి. ఆయన సాహిత్య యాత్ర మామూలు నడకకాదు...“మహాప్రస్థానం..”. ఆయనది నూత్న “ఖడ్గసృష్టి”. ఆయనకీర్తి కిరీటంలో వజ్రపురాయి “సిప్రాలి." సినీగీతాల రసరాజ్యడోల... ఆయన ఊహ చాంపేయమాల, ఆయనఊళకేదారగౌళ!!

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి డాక్టర్ చందు సుబ్బారావు

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి డాక్టర్ చందు సుబ్బారావు

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి డాక్టర్ చందు సుబ్బారావు

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి డాక్టర్ చందు సుబ్బారావు

శ్రీ అదృష్ట దీపక్,శ్రీ విరియాల లక్ష్మీపతి

శ్రీ అదృష్ట దీపక్,శ్రీ విరియాల లక్ష్మీపతి

ప్రసంగిస్తున్న ముఖ్య అతిధి డాక్టర్ చందు సుబ్బారావు

స్వాగతం పలుకుతున్న శ్రీ జంపన రఘురాం

వందన సమర్పణ చేస్తున్నశ్రీ చింతా తాతారెడ్డి

డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ అదృష్ట దీపక్,శ్రీ విరియాల లక్ష్మీపతి

ముఖ్య అతిధులు డాక్టర్ చందు సుబ్బారావు, శ్రీ విరియాల లక్ష్మీపతి,
ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయలక్ష్మి,
శ్రీ అదృష్ట దీపక్ తదితరులు

ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయలక్ష్మి, శ్రీమతి స్వరాజ్యం దీపక్






















No comments: